NTV Telugu Site icon

BRS KTR: చలువ పందిర్లు, త్రాగు నీరు ఏర్పాటు చేయండి.. మున్సిపల్ చైర్మన్ కు కేటీఆర్ ఆదేశం..

Ktr

Ktr

BRS KTR: 24 గంటల్లో చలువ పందిర్లు వేయాలని త్రాగు నీరు ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల పట్టణంలోని రైతు బజార్, గాంధీ చౌక్, లేబర్ అడ్డ ఏరియాలలో మార్నింగ్ వాకింగ్లో భాగంగా ప్రజలతో ముచ్చటిస్తూ బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. స్థానిక రైతు బజార్ లో కూరగాయలు అమ్ముతున్న రైతులతో మహిళలతో మాట్లాడుతూవారితో కరచాలనం చేస్తూ వినోద్ అన్నకు ఓటేయాలని కేటీఆర్ అభ్యర్థించారు. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలుపుకోసం ప్రచారం చేశారు.

Read also: Aravind Kejriwal : ఆప్ ప్రచార గీతాన్ని ఆమోదించిన ఎన్నికల సంఘం

అనంతరం స్థానిక సిరిసిల్ల రైతు బజార్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ మార్కెట్ లో కూరగాయలు అమ్ముతున్న వారు కొన్ని సూచనలు చేశారు. త్రాగు నీరు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున చలువ పందిర్లు వేయాలని కోరారు. 24 గంటల్లో చలువ పందిర్లు వేయాలని త్రాగు నీరు ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్ కు కేటీఆర్ ఆదేశించారు. చాలా మంది కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని అప్పుడు నీళ్లు కరెంటు సక్రమంగా వచ్చేదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పోయిన తరువాత, వాగులో నీళ్లు పోయాయని తర్వాత నెల కూడా పెన్షన్ రావడం లేదని వారు బాధను వ్యక్తం చేశారన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక రైతులను పట్టించుకోలేదని, రుణమాఫీ చేయలేదనీ రైతు బంధు రాలేదని అంటున్నారని తెలిపారు.. పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్ఎస్ వాటికి ఓటు వేసి గెలిపించుకుంటామని ప్రజలు తెలిపారని అన్నారు.
CM Revanth Reddy: నేడు 4 లోక్‌సభ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం..