Site icon NTV Telugu

Revanth Reddy: అధికారిక వాహనాల్లో రేపులు జరిగినా మీకు ప‌ట్ట‌దా?

Revvanthreddy

Revvanthreddy

అధికారిక వాహనాల్లో రేపులు జరిగితే కూడా పట్టదా..? అంటూ టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మీడియాతో రేవంత్ మాట్లాడుతూ.. అధికారిక వాహనాల్లో కూడా అత్యాచారాలు జరిగినా చర్యలు తీసుకోవడం లేదు అంటే కెసిఆర్ ప్రోస్తహిస్తున్నట్టే అని విమ‌ర్శ‌లు గుప్తించారు. కెసిఆర్ కో నచ్చితే నజరానా..? లేదంటే శిక్షలు అంటూ మండిప‌డ్డారు. కెసిఆర్..ఎంఐఎం పాలనలోనే పొత్తు కాదు, అత్యాచారాలు కూడా పొత్తు ల్లోనే చేస్తున్నారని రేవంత్ మండిప‌డ్డారు.

వక్ఫ్ బోర్డు చైర్మన్ నీ ఎందుకు తీసేయడం లేదు కెసిఆర్ అంటూ ప్ర‌శ్నించారు. గవర్నర్.. మోడీకి చెప్పినా.. కెసిఆర్ మాటే మోడీ, అమిత్ షా వింటారంటూ ఎద్దువ చేశారు. పిసిసి లేకున్నా.. చింతన్ శిబిర్ జరుగుతుందని, కాంగ్రెస్ వ్యవస్తాగతంగా బలంగా ఉంది అని అర్దమ‌న్నారు. పార్టీలో ఎవరు రాకున్నా వ్యవస్థ ఆగదు, ఎవరు లేకున్నా.. పనులు ఆగవంటూ చెప్పుకొచ్చారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్‌ సొంత అభ్యర్దిని పెడితే మోడీకి వ్యతిరేకం అని అనుకోవచ్చు.. లేదంటే.. ఏం చేసినా.. బీజేపీ కి అనుకూలమే టీఆర్ఎస్ అంటూ విమ‌ర్శించారు. ఓటింగ్ కి దూరంగా ఉన్నా.. బహిష్కరణ చేసినా బీజేపీ కి టీఆర్ఎస్ అనుకూలమే అని రేవంత్ ఎద్దువ చేశారు. కెసిఆర్ ఆర్ధిక ఉగ్రవాదంటూ ఓరేంజ్ లో కేసీఆర్ విరుచుప‌డ్డారు. ఆర్ధిక క్రమశిక్షణ లేదు, అందుకే తిప్పలు ప‌డుతున్నామ‌ని రేవంత్ మండిప‌డ్డారు.

జూబ్లీహిల్స్ మైన‌ర్ బాలిక రేప్ స్పందించిన రేవంత్‌.. ప‌బ్బుల మీద మెరుపు దాడులు ఉంటాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కార్యాచరణ ప్రకటిస్తాము.. సమయానికి మించి నడిపే పబ్బులు పై ప్రభుత్వం దాడి చేయాలని రేవంత్ అన్నారు. ప్రభుత్వం దాడులు చేయనప్పుడు ప్రజలు దాడి చేస్తారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దాన్ని చూసి ప్రభుత్వం చైతన్యం పొందాలని ఎద్దేవ చేశారు.

నేషనల్ ఎయిర్‌పోర్ట్ కి ఎన్‌టీఆర్ పేరు పెడితే తీసేసింది కెసిఆర్ కాదా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అసెంబ్లీ లో అడిగితే బండ బూతులు తిట్టారు.. ఆ విష‌యాన్ని ఎన్‌టీఆర్ అభిమానులు అంత తొందరగా మర్చిపోతారా..? అంటూ ప్ర‌శ్నించారు. ఎన్‌టీఆర్ ఘాట్ లో వర్ధంతి.. జయంతిలు కూడా అధికారికంగా చేయాల్సింది ఆపేశారు కెసిఆర్ అంటూ మండిపడ్డారు. సడన్ గా టీఆర్ఎస్‌ కి ఎన్‌టీఆర్ మీద ప్రేమ పుట్టింది. కెసిఆర్ వేషం..పాత పడింది.. జనం నమ్మరంటూ రేవంత్ చెప్పుకొచ్చారు. బీజేపీ హైదరాబాద్ లో సమావేశాలు పెట్టగానే అయిపోతుందా..? ఏమౌతుంది.. ఏమి కాదు అంటూ రేవంత్ ఈ సంద‌ర్భంగా టీఆర్ ఎస్‌, బీజేపీ, పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Revanth Reddy: అత్తా కోడళ్ళ పంచాయతీ లెక్క.. బీజేపీ, టీఆర్ఎస్ పంచాయతీ

Exit mobile version