NTV Telugu Site icon

KCR: నేడు నిజామాబాద్‌ లో కేసీఆర్‌ రోడ్ షో..

Kcr

Kcr

KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్, జహీ రాబాద్ పార్లమెంట్ స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో కేసీఆర్ పర్యటన తమకు లాభిస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌, ఆర్మూర్‌ రోడ్‌షో మీదుగా కేసీఆర్‌ నిజామాబాద్‌ రానున్నారు. సాయంత్రం నిజామాబాద్‌లోని నెహ్రూ పార్కులో కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించనున్నారు. రాత్రి నిజామాబాద్‌లో బస చేస్తారు. ఇక రేపు (మంగళవారం) కామారెడ్డి జిల్లాలో బస్సు యాత్ర చేయనున్నారు. అదే రోజు సాయంత్రం కామారెడ్డి పట్టణంలో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. కేసీఆర్ నగరంలో బస్సుయాత్ర నిర్వహించనున్న నేపథ్యంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా రోడ్‌షో జరిగే పలు కూడళ్లను పరిశీలించారు.

Read also: China: పెళ్లికి ముందు వైద్య పరీక్షలు.. పురుషుడిగా తేలిన మహిళ

నగరంలో ట్రాఫిక్ మళ్లింపు

* నగరంలో సోమవారం మాజీ సీఎం కేసీఆర్‌ రోడ్‌ షో సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు సీపీ కల్మేశ్వర్‌ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు నగరంలోని పలు ప్రాంతాల్లో కేసీఆర్ రోడ్ షో కారణంగా కింది ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించారు.

* బోదన్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు అర్సపల్లి రైల్వేగేట్ మీదుగా కొత్త కలెక్టరేట్ మీదుగా కంఠేశ్వర్ బైపాస్, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా బస్టాండ్ చేరుకోవాలి.

* బోధన్ వెళ్లే ఆర్టీసీ బస్సులు రైల్వే ఫ్లై ఓవర్, శివాజీ చౌక్, నిజాం కాలనీ, అర్సపల్లి మీదుగా వెళ్లాలి.

* మాధవనగర్ నుంచి బోదన్ వెళ్లే వాహనాలు పులాంగ్ సర్కిల్, ఆర్ ఆర్ చౌరస్తా, వర్ని చౌరస్తా, ఈద్గా రోడ్డు అర్సపల్లి మీదుగా వెళ్లాలి.

పార్కింగ్ స్థలాలు

* ఆర్మూర్‌, డిచ్‌పల్లి నుంచి వచ్చే వాహనాలు ప్రెస్‌క్లబ్‌, పాత కలెక్టరేట్‌ గ్రౌండ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ముందు ఆగాలి.

* బోధన్ వైపు నుంచి వచ్చే వాహనాలు శైలజా గ్రౌండ్, ఖిల్లా జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో పార్కింగ్ చేయాలి. వాహనదారులు, ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు. నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం, విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణుల సన్నాహాలు చేస్తున్నారు.
Israel Hamas Conflict: ఈ ప్రపంచంలో ఎవరు కూడా మమ్మల్ని ఆపలేరు