Site icon NTV Telugu

KCR: నేడు కరీంనగర్‌లో కేసీఆర్‌ రోడ్‌ షో.. తెలంగాణచౌక్‌ వరకు ర్యాలీ

Kcr

Kcr

KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు కరీంనగర్ లో పర్యటించనున్నారు. సాయంత్రం నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. గులాబీ దళపతి హైదరాబాద్ నుండి రాజీవ్ రహదారి మీదుగా వచ్చి నగరంలోని బైపాస్ రోడ్డు మీదుగా రాంనగర్ చౌరస్తాకు చేరుకుంటారు. రాంనగర్ చౌరస్తాలో ఘన స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి ర్యాలీ ప్రారంభమై మంకమ్మతోట, టూటౌన్ పోలీస్ స్టేషన్, ముకరంపుర మీదుగా తెలంగాణచౌక్‌కు చేరుకుంటుంది. అక్కడ నిర్వహించే రోడ్ షోలో కేసీఆర్ పాల్గొననున్నారు. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ పాలనకు, నేటి కాంగ్రెస్ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా వివరించనున్నారు.

Read also: Covishield Vaccine : కొవిషీల్డ్ తో అరుదైన సైడ్ ఎఫెక్ట్స్.. అంగీకరించిన తయారీ సంస్థ

స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన అభివృద్ధిని తన ముందుంచనున్నారు. ముఖ్యంగా ఎంపీగా, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగానే కాకుండా మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్, తనతో కలిసి పోటీ చేస్తున్న వినోద్ కుమార్ కరీంనగర్ నుంచి గెలవాల్సిన ఆవశ్యకతను వివరించనున్నారు. నేటి కేసీఆర్‌ రోడ్‌షోకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరానున్నారు. ఈ రాస్తారోకోను విజయవంతం చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో పాటు బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. కరీంనగర్‌లో రోడ్‌షో నిర్వహించేందుకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ సభ అనంతరం కరీంనగర్ తీగలగుట్టపల్లిలో బస చేయనున్నారు. అనంతరం రేపు (శుక్రవారం) సాయంత్రం సిరిసిల్లలో నిర్వహించే రోడ్‌షోకు వెళ్తారు. అనంతరం సిద్దిపేటలో జరిగే రోడ్‌షోలో పాల్గొంటారు.
Pakistan : పోలీసులు, లాయర్ల మధ్య ఘర్షణ.. 25 మందికి పైగా గాయాలు

Exit mobile version