Covishield Vaccine : కొవిషీల్డ్ తో అరుదైన సైడ్ ఎఫెక్ట్స్.. అంగీకరించిన తయారీ సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ తయారీ కంపెనీ ఆస్ట్రాజెనెకా బాంబు పేల్చింది. ఈ టీకా తీసుకున్న వారికి అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ నిజమేనంటూ కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో పేర్కొన్నట్టు యూకేకు చెందిన డైలీ టెలిగ్రాఫ్ న్యూస్ పేపర్ పేర్కొంది. టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్లు పడిపోవడం వంటి దుష్ప్రభావాలు తలెత్తాయని అంగీకరించింది. కరోనా తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి బ్రిటిష్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా ఈ వ్యాక్సిన్ (కొవిషీల్డ్)ను అభివృద్ధి చేసింది. ఇదే వ్యాక్సిన్‌ను మన దేశంలో సీరం ఇనిస్టిట్యూట్ తయారుచేసింది. దేశంలో అత్యధికంగా తీసుకున్న టీకా ఇదే. కాగా జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
READ MORE: Samsung Galaxy F55 5G : శాంసంగ్ నుంచి అదిరిపోయే ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే?
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఈటీకా తీసుకున్న చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఈ టీకా ఒకరి మృతికి కారణం కావడంతోపాటు మరో 51 మంది తీవ్రంగా ఇబ్బంది పడినట్టు కేసు నమోదైంది. జరిగిన నష్టానికి 100 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 1000 కోట్లు) పరిహారం కోరుతూ యూకే హైకోర్టులో దావా నమోదైంది. ఏప్రిల్ 2021లో ఈ టీకా తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడంతో తన మెదడు శాశ్వతంగా దెబ్బతిందని జామీ స్కాట్ అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. ఈ కారణంగా తాను ఉద్యోగం చేయలేకపోయానని, తాను చనిపోబోతున్నట్టు వైద్యులు తన భార్యతో చెప్పారని పేర్కొన్నాడు. దీంతో అసలు విషయం బయట పడింది.
కొవిషీల్డ్‌తో దుష్ప్రభావాలు నిజమేనని కోర్టుకు సమర్పించిన పేపర్లలో ఆస్ట్రాజెనెకా అంగీకరించింది. చాలా అరుదుగా ఇది టీటీఎస్ (థ్రాంబోసిస్ విత్ త్రాంబోసైటోపెనియా సిండ్రోమ్)కు కారణమవుతున్నట్టు తెలిపింది. దీనివల్ల రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్ల కౌంట్ పడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కొవిషీల్డ్‌తో దుష్ప్రభావాలు నిజమేనని అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.. టీకా సామర్థ్యంపై వస్తున్న వార్తలను మాత్రం ఖండించింది. ఈ వ్యాక్సిన్ ఇక నుంచి వినియోగానికి అనుమతి లేదని యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఆ సంస్థకు నోటీసు కూడా జారీ చేసింది.
తాజావార్తలు
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!