NTV Telugu Site icon

KCR: నేడు కేసీఆర్‌ రెండు జిల్లాల పర్యటన.. ఎండిన పంటల పరిశీలన..

Kcr

Kcr

KCR: పొలంబాటలో భాగంగా నేడు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తు ముందుకు సాగుతున్నాను. ఇటీవల నల్గొండ, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో కేసీఆర్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఎండిన పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. ఇందులో భాగంగా ఇవాళ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. ఈమేరకు రెండు జిల్లాల పర్యటనకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఎర్రవెల్లి ఫారం నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 11 గంటలకు కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ గ్రామానికి చేరుకుంటుంది. అక్కడ ఎండిన పంటలను పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకుంటారు.

Read also: Family Star: ‘ఫ్యామిలీ స్టార్‌’ స్ట్రీమింగ్ పార్ట్నర్ ఎవరంటే?

ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో మధ్యాహ్నం 12.30 గంటలకు భోజనం. అనంతరం మధ్యాహ్నం 2:00 గంటలకు బోయినపల్లి మండల కేంద్రంలో ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించి రైతుల సమస్యలను విని వారిని ప్రోత్సహిస్తారు. మధ్యాహ్నం 3:00 గంటలకు సభాష్‌పల్లి వంతెన వద్ద మిడ్ మానేరు ప్రాజెక్టును సందర్శిస్తారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కీలక నేతలతో రోజా దళపతి సమావేశం కానున్నారు. ఈ భేటీ అనంతరం సాయంత్రం 4:00 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో కేసీఆర్ పాల్గొని కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ ప్రకటన కోసం బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత సిరిసిల్లలో బయల్దేరి సాయంత్రం 5 గంటలకు బయలుదేరి రాత్రి 7 గంటల వరకు ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు కేసీఆర్ చేరుకుంటారు.
SRH Vs CSK IPL 2024: సొంతగడ్డపై సన్‌రైజర్స్ మరోసారి విజృంభిస్తుందా..?!