ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులపై కేసీఆర్ స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున, పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నానని, అందుకే రేపటి విచారణకు హాజరుకాలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలని, తనకు మరింత సమయం కావాలని ఆయన సిట్ అధికారులను కోరారు. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని కేసీఆర్ తన సమాధానంలో పేర్కొన్నారు. అయితే విచారణను తన నివాసమైన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే నిర్వహించాలని ఆయన అధికారులను కోరారు.
హైదరాబాద్‌లోని పోలీస్ స్టేషన్‌కు రావడం కంటే, ఫామ్‌హౌస్‌లోనే అధికారులు ప్రశ్నలు అడిగితే తాను సమాధానాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. కేసీఆర్ ఇచ్చిన రిప్లైపై సిట్ అధికారులు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మున్సిపల్ ఎన్నికల కారణాన్ని అధికారులు అంగీకరిస్తారా? లేక రేపే ఎర్రవల్లికి వెళ్లి విచారణ జరుపుతారా? అనేది చూడాలి. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు వంటి ముఖ్య నేతలు ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో భేటీ అయి ఈ న్యాయపరమైన అంశాలపై చర్చించారు. నోటీసులు అందగానే కేసీఆర్ ఇలా సమయం కోరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Municipal Elections : ఎన్నికల పుణ్యమా అని మున్సిపాలిటీకి కాసుల వర్షం..!
