NTV Telugu Site icon

Vemula Prashanth Reddy: మోడీలకు, ఈడీలకు కేసిఆర్ భయ పడడు, దేనికైనా సిద్ధమే..!

Vemula Prashanth Reddy

Vemula Prashanth Reddy

రాష్ట్ర గవర్నర్ తమిలిసై తను రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నాననే మర్చిపోయారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకురాలి పాత్ర పోషిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలచే ఎన్నుకోబడిన కేసీఆర్ ను కేంద్రంచే నియమించబడిన గవర్నర్ ఎలా విమర్శిస్తుంది..? అని ప్రశ్నించారు. మోడీ ఏది చెప్తే గవర్నర్ అదే మాట్లాడుతున్నారని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలను కూలదోస్తున్నారన్నారు. పార్టీలకు అతీతంగా ఉండాల్సిన గవర్నర్ రాజ్ భవన్ లో బీజేపీ నేతలతో సమావేశాలు ఎలా పెడతారు..? అని ప్రశ్నించారు. గవర్నర్ అధికార పర్యటనలు ప్రభుత్వానికి, అధికారులకంటే ముందే బీజేపీ వాళ్లకు ఎలా తెలుస్తుంది..? అని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న మతలబు ఏంది..? అని నిలదీశారు.

ఏమన్నా అంటే ఈడీ, సీబీఐ కేసులు పెడతామంటున్నారని మండిపడ్డారు. మోడీలకు, ఈడీలకు కేసిఆర్ భయ పడడు, దేనికైనా సిద్ధమే..! అని సవాల్‌ విసిరారు. “ప్రాంతేతరులు మోసం చేస్తే పొలిమేరదాకా తరిమికొట్టు- నీ ప్రాంతం వాడే మోసం చేస్తే ఇక్కడే పాతరెయ్యి”అన్న కాళోజీ మాటలు బీజేపీ కి వర్తిస్తాయని అన్నారు. వ్యవసాయాన్ని కూడా అదాని, అంబానీలకు దారాదత్తం చేసి రైతు నోట్లో మట్టి కొట్టే కుట్ర చేస్తున్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎన్నటికైనా కేసీఆరే తెలంగాణకు, దేశానికి శ్రీరామరక్ష అని అన్నారు.
Himanta Biswa Sarma: కేసీఆర్ చంద్రుడి మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. దేశంలో సాధ్యం కాదు..