NTV Telugu Site icon

Speaker Gaddam Prasad Kumar: గత ప్రభుత్వం కాగితం మాత్రమే ఇచ్చింది.. డబ్బులు ఇవ్వలేదు..!

Speaker

Speaker

Speaker Gaddam Prasad Kumar: గత ప్రభుత్వం జిల్లా పరిషత్ భవనం కోసం ఆర్డర్ కాగితం మాత్రమే ఇచ్చిందని నిర్మాణం కోసం డబ్బులు ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఈ రోజు వికారాబాద్ జిల్లా ప్రజా పరిషత్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్పీకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జిల్లా పరిషత్ భవన నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు ఇస్తామని జీవో చేశారు తప్పా.. ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు.

Read Also: Hero Nani : ‘కల్కి’లో ఆ పాత్రలో కనిపించబోతున్న నాని…?

ఇక, జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి చొరవతో జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులను ఒప్పించి వారికి ఇవ్వాల్సిన డబ్బులను జనరల్ ఫండ్ కింద తీసుకొని ఐదు కోట్ల రూపాయలతో జడ్పీ భవన నిర్మాణం చేశారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గత ప్రభుత్వ నాయకులు కూడా డబ్బు తీసుకొచ్చేందుకు ప్రయత్నించి ఉంటే బాగుండేదన్నారు. ఇప్పుడు ఆ బాధ్యత తనపై వేశారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల సహకారంతో ఇతరత్రా పనులన్నీ కూడా 6 నుంచి 8 నెలల లోపు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం తర్వాత పట్టణంలోని ట్రాన్స్ జెండర్స్ కి స్పీకర్ సర్టిఫికెట్ పంపిణీ చేశారు.

Read Also: Lok sabha: ఎమర్జెన్సీపై 2 నిమిషాల మౌనం.. విపక్షాల ఆందోళన.. వాయిదా

అలాగే, ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జడ్పీ సీఈవో సుధీర్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్, పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.