KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి ఇవాళ ఉదయం 11 గంటలకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి కేసీఆర్ నేరుగా బంజారాహిల్స్‌లోని నందినగర్‌లోని తన ఇంటికి పయనం అయ్యారు. తుంటి మార్పిడి శస్త్రచికిత్స కారణంగా కేసీఆర్ యశోద వారం రోజులుగా ఆసుపత్రిలో ఉన్నారు. చికిత్స అనంతరం కేసీఆర్ కొద్దికొద్దిగా కోలుకోవడంతో వైద్యులు ఈరోజు డిశ్చార్జి చేశారు. వేద పండితుల పూజల అనంతరం కేసీఆర్ ఆసుపత్రిని నుంచి ఇంటికి బయలుదేరారు. కేసీఆర్‌తో పాటు యశోద ఆస్పత్రి నుంచి కేటీఆర్, హరీశ్ రావులు బయలుదేరారు. అయితే కేసీఆర్ మరో నాలుగైదు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నెల 8వ తేదీ రాత్రి కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో జారి పడిపోయిన సంగతి తెలిసిందే.
Read also: Praja Bhavan: ప్రజావాణికి భారీగా జనం.. భూ సమస్య, పెన్షన్ల పై ఫిర్యాదులు
దీంతో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆయనను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. 9న కేసీఆర్ తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత వాకర్ సాయంతో కేసీఆర్ ను డాక్టర్లు నడిపించారు. ఆస్పత్రిలో కేసీఆర్‌ను రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించిన సంగతి తెలిసిందే. అయితే.. ఏ కాస్త సమయం దొరికిన ఎర్రవెల్లిలోని తన ఫోమ్ హౌస్‌లో గడపడం కేసీఆర్‌కు ఇష్టం. దీంతో అదే ఫోమ్ హౌస్‌లో జారిపడటంతో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపిన నేపథ్యంలో నందినగర్ నివాసానికి తీసుకెళ్లి ఆయనను జాగ్రత్తగా చూసుకోవాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. 7 రోజుల పాటు యశోద ఆస్పత్రి లో ట్రీట్మెంట్ లో ఉన్న కేసీఆర్ ఇవ్వాళ డిశ్చార్జ్ అయ్యారు. కేసీఆర్ పూర్తిగా విశ్రాంతి తీసుకోవడానికే పరిమితం కాకుండా.. సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదువుతూ మెదడుకు పని కల్పిస్తూనే ఉన్నారు. సాధారణంగా.. కేసీఆర్ కు చదవడం అంటే మక్కువ కాబట్టి.. ఇప్పుడు ఆస్పత్రిలో ఖాళీగా ఉండడం ఇష్టం లేక.. ప్రముఖ పుస్తకాలు తీసుకొచ్చి చదివేవారు.
Stock Market Opening: తగ్గేదేలే అంటున్న స్టాక్ మార్కెట్లు.. 71వేల మార్కుకు దగ్గరగా సెన్సెక్స్