KCR: నేడు కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ప్రచారం నిర్వహించకుండా ఈసీ నిషేధం విధించిన 48 గంటల తర్వాత తిరిగి ఇవాళ కేసీఆర్ యాత్ర కొనసాగనుంది. గోదావరి ఖని చౌరస్తాలో అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉన్న నిషేధం.. 8 గంటల తర్వాత మీటింగ్ లో కేసీఆర్ పాల్గొననున్నారు. అయితే.. గడువు ముగిసిన 8 గంటల తర్వాత కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్డు షో గతంలో ప్రకటించిన విధంగా యదావిధిగా కొనసాగనుంది.
Read also: Harish Rao: కాంగ్రెస్ వచ్చాక బంగారం, నిత్యవసర ధరలు పెరిగాయి..
అసలు ఏం జరిగింది..
ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. మే 1 (నేడు) రాత్రి నుంచి 48 గంటల పాటు బీఆర్‌ఎస్ చీఫ్ ప్రచారానికి ఈసీ బ్రేక్ వేసింది. సిరిసిల్ల సభలో కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఈసీ ఈ చర్య తీసుకుంది. కేసీఆర్ బస్సుయాత్రలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు కేసీఆర్ 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించింది. నిన్న (బుధవారం) రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు నిషేధం అమల్లో ఉంటుంది. అయితే నేటితో మళ్లీ ప్రజల్లోకి కేసీఆర్ బస్సు యాత్రతో వెళ్లనున్నారు.
Read also: Pakistan: పాకిస్తాన్‌లో దారుణం.. బస్సు కాలువలో పడి 20 మంది మృతి
షెడ్యూల్ ఇదే..
* 03.05.2024 నాడు సాయంత్రం 8 గంటల తర్వాత రామగుండం లో రోడ్డు షో
* 04.05.24 నాడు సాయంత్రం మంచిర్యాల రోడ్డు షో
* 05.05.24 సాయంత్రం జగిత్యాల రోడ్డు షో
* 06.05.24 సాయంత్రం నిజామాబాద్ రోడ్డు షో
* 07.05.24 నాడు కామారెడ్డి రోడ్డు షో అనంతరం మెదక్ లో రోడ్డు షో
* 08.05.24 నాడు నర్సాపూర్ రోడ్డు షో అనంతరం పటాన్చెరు లో రోడ్డు షో
* *09.05.24 నాడు కేసీఆర్ బస్సు యాత్ర కరీంనగర్ చేరుకుంటుంది అదే రోజు సాయంత్రం కరీంనగర్లోరోడ్డు షో
* 10.05.24 ( ఆఖరి రోజు )సిరిసిల్లలో రోడ్డు షో అనంతరం సిద్దిపేట లో బహిరంగసభ…అనంతరం కేసీఆర్ బస్సు యాత్ర ముగుస్తుంది.
Noida : డాగ్ లవర్స్ తాట తీసిన.. నోయిడా జనాలు.. స్టేషన్లో రచ్చ రచ్చ