Site icon NTV Telugu

KCR : కొంతమంది బీఆర్‌ఎస్‌ నేతలను అరెస్ట్‌ చేయొచ్చు.. భయపడొద్దు

Kcr

Kcr

KCR : సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కీలక సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై కమిషన్ నివేదిక బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆరు గంటలుగా కొనసాగుతున్న ఈ భేటీలో హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వంటి పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కాళేశ్వరం అంశంపై పార్టీ తరఫున తీసుకోవాల్సిన భవిష్యత్ చర్యలపై చర్చించారు.

Shilpa Ravi: జగన్‌ను జైలుకు పంపేందుకు కుట్ర.. కూటమి ప్రభుత్వంపై శిల్పా రవి ఆగ్రహం

సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్” అని వ్యాఖ్యానించారు. కమిషన్ నివేదిక ఊహించినట్లుగానే వచ్చిందని, దానిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

“కొంతమంది బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే భయపడవద్దు. ఇది రాజకీయ పన్నాగం తప్ప మరేం కాదు,” అని కేసీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును పనికిరాదని చెప్పేవారు అజ్ఞానులని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని పార్టీగా బలంగా తిప్పికొట్టాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణకు కలిగిన ప్రయోజనాలను ప్రజలకు విపులంగా వివరించాలని సూచించారు.

కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం పై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని చూసి తగిన వ్యూహం సిద్ధం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.

AI Girls: బూతులు మాట్లాడే అందమైన భామలు.. కామెడీ పేరుతో కామకథలు!

Exit mobile version