Site icon NTV Telugu

BRSLP Leader: బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్‌.. ఏకగ్రీవ ఎన్నిక..

Kcr

Kcr

BRSLP Leader: కొత్తగా ఎన్నికైన బీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు తమ పార్టీ అధినేతగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశరావు అధ్యక్షతన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 39 సీట్లు గెలుచుకుని ప్రతిపక్షంగా అవతరించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమై ఈ మేరకు తీర్మానం చేశారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ పేరును ప్రతిపాదించగా, తలసాని శ్రీనివాస యాదవ్, కడియం శ్రీహరి బలపరిచారు.

Read also: Manipur: మణిపూర్ ప్రభుత్వానికి మానవ హక్కుల సంఘం నోటీసులు.. కారణం ఇదే?

శాసనసభా పక్షానికి సంబంధించి మిగిలిన సభ్యుల ఎంపిక బాధ్యతను కేసీఆర్‌కు అప్పగిస్తూ బీఆర్‌ఎస్‌ఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. శస్త్ర చికిత్స కారణంగా ఇవాళ జరిగిన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశానికి బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హాజరుకాలేదు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మిగిలిన 38 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తమ పార్టీ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్‌ను ఎన్నుకుంటూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు. తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ తొలి సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు సమావేశమై పార్టీ విధివిధానాలు, అభ్యర్థుల ప్రవర్తనా నియమావళి, సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. తదితర సభల అనంతరం బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళులర్పించి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు.
Hi Nanna: సెకండ్ డే జోష్ పెరిగింది మరి కలెక్షన్స్ సంగతేంటి?

Exit mobile version