Kavitha : మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తా.. డాడీ, మోడీ, చిన్న మోడీపై నా పోరాటం..
- పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతుంది
- మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తాను
- గాంధీజీ సర్వోదయ సిద్దాంతాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నాను
- డాడీ, మోడీ, చిన్న మోడీపై నా పోరాటం ఉంటుంది
- బీఆర్ఎస్తో నా ఇష్యూను కాంగ్రెస్, సీఎం రేవంత్ అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. -కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavitha New Party: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. గత కొంతకాలంగా మౌనంగా ఉన్న ఎమ్మెల్సీ కవిత, తన భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే నూతన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పార్టీ అజెండాపై ప్రస్తుతం లోతైన కసరత్తు జరుగుతోందని కవిత వెల్లడించారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ సర్వోదయ సిద్ధాంతాన్ని తాను లోతుగా అధ్యయనం చేస్తున్నానని, అదే అజెండాతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. మంచి ముహూర్తం చూసుకుని పార్టీ పేరును, ఇతర వివరాలను అధికారికంగా ప్రకటిస్తానని ఆమె తెలిపారు. ఇప్పటికే పార్టీ పేరు విషయంలో అన్నీ సెట్ అవుతున్నాయని, కార్యాలయం కోసం స్థలాన్ని కూడా అన్వేషిస్తున్నామని ఆమె వివరించారు.
Panchanga Sravanam: సీఎం రేవంత్‌రెడ్డికి పాలన పరంగా ఇబ్బందులు లేవు.. గాంధీ భవన్ పంచాంగ శ్రవణం
Also Read
- TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
- Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
తన రాజకీయ పోరాటం ఎవరితో ఉండబోతోందో కవిత సూటిగా చెప్పారు. డాడీ, మోడీ, చిన్న మోడీ పైనే తన పోరాటం ఉంటుందని ఆమె ప్రకటించారు. తనకు ఎవరితోనూ రాజీ లేదని, తన కొత్త పార్టీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీతో తనకు ఉన్న సమస్యలను కాంగ్రెస్ పార్టీ , సీఎం రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారని కవిత ఆరోపించారు. అసెంబ్లీలో సైతం కాంగ్రెస్ నేతలు తన ఇష్యూను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.
Nitish Kumar: బీహార్ కొత్త ముఖ్యమంత్రి పేరుపై నితీష్ కుమార్ సంకేతాలు!.. భగ్గుమంటున్న జేడీయూ నేతలు!
శ్రీరామనవమి తర్వాత పార్టీ ప్రకటన ఉంటుందని, అంతకంటే ముందే జాతీయ స్థాయి నేతలను కలుస్తానని కవిత తెలిపారు. చాలా మంది జాతీయ నాయకులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, వారి మద్దతు కూడగడతానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన యువతకు తన పార్టీలో పెద్దపీట వేస్తానని ప్రకటించారు. తనకు ఎలాంటి బేషజాలు లేవని, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నూతన పార్టీ ప్రభావం ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని ఆమె విశ్లేషించారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ అనే తేడా లేకుండా చాలా చోట్ల నుంచి తనను పోటీ చేయాలని ప్రజలు కోరుతున్నారని, రీసెంట్ గా వనపర్తి నుంచి పోటీ చేయాలని జాగృతి కార్యకర్తలు కోరారని ఆమె వెల్లడించారు.
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!