తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయంపై ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌లో తనపై విధించిన అన్ని బాధ్యతల నుంచి స్వయంగా రాజీనామా చేసినప్పటికీ, పార్టీ తనను ఏకపక్షంగా బయటకు పంపిందని ఆమె అన్నారు. “ఎవరి పనితీరు ఎలా ఉందో సమీక్ష చేసి ఉంటే, మొన్నటి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయిండేది కాదని” కవిత స్పష్టంగా చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో రెండో రోజు కొనసాగుతున్న “జనంబాట” కార్యక్రమంలో మోపాల్ మండలం బైరాపూర్ గ్రామాన్ని పర్యటించిన కవిత, ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ కార్యక్రమంపై ఒక ఎంపీ ఆధారంలేని ఆరోపణలు చేసింది అని ఆమె సోషల్ మీడియాలో తెలిపారు.
Baahubali : శ్రీదేవి పాత్ర నాకు వచ్చిందని తెలియదు.. రమ్యకృష్ణ కామెంట్స్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎలాంటి స్టాండ్ తీసుకోలేదని ఆమె అన్నారు. అందరి తెలంగాణ కావాలి.. కొందరి తెలంగాణ కావొద్దు అనేది మా లక్ష్యమని, బీఆర్‌ఎస్ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ మారారో నాకు తెలియదని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకొని నన్ను బయటకు పంపిందని, ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని, నేను నా రాజీనామాకు కట్టుబడి ఉన్నానని కవిత వెల్లడించారు. విద్యా రంగంలోనూ కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, “సామాజిక తెలంగాణ కోసం ప్రతి జిల్లాలో కార్యక్రమాలు కొనసాగిస్తాను” అని చెప్పారు.
Salman Khan – Pakistan: సల్మాన్ ఖాన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన పాకిస్థాన్.. ఇప్పుడు ఏం జరుగుతుంది?
