Site icon NTV Telugu

Kalvakuntla Kavitha : బీఆర్ఎస్ పై కవిత కీలక వ్యాఖ్యలు

Mlc Kavitha Vs Harish Rao

Mlc Kavitha Vs Harish Rao

Kalvakuntla Kavitha : బతుకమ్మ వేడుకల సందర్భంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. చింతమడక నుంచి లండన్ వరకు బతుకమ్మను తీసుకెళ్లిన అనుభవం ఉందని గుర్తుచేసిన ఆమె, ప్రస్తుతం తెలంగాణలో సోయి లేని ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. బతుకమ్మ నిమజ్జనంలో సీఎం పాల్గొనడం ఆహ్వానించదగ్గ విషయమేనని పేర్కొన్న కవిత, అయితే గిన్నిస్ రికార్డ్ కోసం బతుకమ్మను వాడుకోవడం ఎందుకని ప్రశ్నించారు. కేవలం పది వేల మంది మహిళలతో బతుకమ్మ నిర్వహించి అవమాన పరిచారని ఆరోపించారు.

Cyclone Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన..

వచ్చే సంవత్సరం లక్ష మంది మహిళలతో బతుకమ్మ జరిపి గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదిస్తామని కవిత ప్రకటించారు. బీసీ కులగణన చేపట్టినప్పుడు తప్పు అన్నారు, కానీ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ల జీవో ఇచ్చిన వెంటనే కేసులు వేశారని కవిత విమర్శించారు. రేవంత్ రెడ్డి సన్నిహితులే ఈ కేసులు వేశారని ఆమె ఆరోపించారు. బీజేపీ నేత ఈటెల రాజేందర్‌పై కూడా కవిత ఘాటు కామెంట్స్ చేశారు. “ఎవరూ పోటీ చేయొద్దంటూ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఈటెల వ్యాఖ్యలు వ్యక్తిగతవేనా? లేక బీజేపీ పార్టీ స్టాండ్‌నా?” అని ప్రశ్నించారు.

మహారాష్ట్రలా ఎన్నికలు రద్దవుతాయని ఈటెల చెప్పడం కోర్టులను ప్రభావితం చేసే ప్రయత్నమేనని ఆమె విమర్శించారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేసినప్పటికీ, వర్గీకరణ వారీగా రిజర్వేషన్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని కవిత వ్యాఖ్యానించారు. ఈ నెల 8న కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మా కార్యాచరణను ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు.

స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయో లేదో ఇంకా క్లారిటీ లేదని, పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ పనులను ప్రభుత్వం చేపట్టడం స్వాగతించదగ్గదని పేర్కొన్నారు. బీసీ హక్కుల కోసం బీఆర్‌ఎస్ ఉద్యమం చేస్తే మంచిదని సూచించారు.

7,000mAh బ్యాటరీ, 50MP సోనీ AI కెమెరా, IP69 రేటింగ్‌తో Realme 15x 5G లాంచ్.. ధర ఎంతంటే?

Exit mobile version