MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు చుక్కెదురు.. బెయిల్ నిరాకరించిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు ఈ విధంగా తీర్పు వెలువరించింది. కవిత కు వ్యతిరేకంగా ఈడి, సిబిఐ కేసులు ఉండటంతో.. రెండు కేసుల్లో కవిత కు బెయుల్ నిరాకరించింది కోర్టు. రెండు కేసుల్లో కవిత దాఖలు చేసిన వేసిన పిటీషన్లను న్యాయమూర్తి కావేరీ బవేజా డిస్మిస్ చేశారు. కవిత ప్రస్తుతం తిహాద్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. కవిత దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ, సీబీఐ కోర్టుకు తెలిపాయి. స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చిందని కవిత కోర్టుకు తెలిపారు. మహిళగా తనకు పీఎంఎల్‌ఏ సెక్షన్ 45 కింద బెయిల్‌కు అర్హత ఉందని కవిత కోర్టుకు తెలిపారు.
Read also: Petrol Price : ఒక నెలలో 10శాతం పడిపోయిన క్రూడాయిల్ ధర.. మరి పెట్రోల్ ధరల పరిస్థితి
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లు మరోసారి తిరస్కరణకు గురయ్యాయి. అయితే తాజాగా కవిత మాట్లాడుతూ.. నేను అప్రూవర్ గా మారేది లేదని, కడిగిన ముత్యంలా బయటికి వస్తానని అన్న విషయం తెలిసిందే. ఇది మనీలాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అన్నారు. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు కానీ.. ఒక నిందితుడు ఆల్రెడీ బిజెపిలో చేరాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకో నిందితుడు బీజేపీ టికెట్ ఇచ్చిందని అన్నారు. మూడో నిందితుడు రూ.50 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడని తెలిపారు. క్లీన్ గా బయటకు వస్తా.. అప్రూవ్ వర్ గా మారేది లేదని క్లారిటీ ఇచ్చారు. మరి రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.
The Goat Life OTT : ఓటీటీలోకి రాబోతున్న సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!