NTV Telugu Site icon

Telangana MLA: ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. అర్థరాత్రి న్యూడ్ వీడియో కాల్..

Nude Video Call

Nude Video Call

Telangana MLA: టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ నేరాలు కూడా పెరుగుతున్నాయి. సామాన్యులు, రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారవేత్తలు అందరూ సైబర్ నేరాల బారిన పడుతున్నారు. తాజాగా.. తెలంగాణ ఎమ్మెల్యేను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. అక్టోబరు 14న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్ వచ్చింది.. కాల్ లిఫ్ట్ చేసిన ఎమ్మెల్యే ఆయన న్యూడ్‌గా చూసి షాక్ అయ్యారు. అంతే.. ఫోన్ స్క్రీన్‌పై ఓ మహిళ న్యూడ్ గా కనిపించడంతో షాక్ అయ్యారు. వెంటనే కాల్ కట్ చేశాడు. అతడిని ఇరికించడానికి ఎవరైనా న్యూడ్ కాల్ చేశారా? లేక నిజంగా గుర్తు తెలియని వ్యక్తులు చేశారా? అనే అనుమానం వచ్చి వెంటనే హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానీ ఆన్‌లైన్‌లో తెలియని వ్యక్తుల లింక్‌లు, URLలను క్లిక్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని, యువతులతో వీడియో కాల్స్ చేయిస్తానని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారి పట్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అంతేకాదు డబ్బు పెట్టుబ‌డుల‌పై వారు చెప్పే మాట‌ల‌ను ఎవ‌రూ నమ్మొద్ద‌ని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల విషయంలో ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని అప్రమత్తం చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై అందరూ షాక్ కు గురయ్యారు.
CM Revanth Reddy: నేడు చార్మినార్‌ కు సీఎం రేవంత్‌ రెడ్డి.. భారీ బందోబస్తు..

Show comments