Site icon NTV Telugu

Protest: మాకు చలానా వేస్తారు కదా..? ఇప్పుడు నాకు ఫైన్‌ కట్టండి..

Protest

Protest

Protest: వాహనదారులకు రకరకాల ఫైన్లు వేస్తుంటారు పోలీసులు.. హెల్మెట్‌ లేకపోతే ఫైన్‌.. లైసెన్స్‌ లేకపోతే ఫైన్‌.. ఆర్‌సీ లేకపోతే వడ్డింపు.. పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేకున్నా ఫైన్‌.. రెడ్‌ సిగ్నల్‌ దాటితే ఫైన్‌.. ఇక, ఓవర్‌ లోడ్‌, ట్రిపుల్‌ రైడింగ్.. ఇలా రకరకాలుగు ఫైన్లు వేస్తారు.. డ్రంకెన్‌ డ్రైవ్‌ ఫైన్‌తో పాటు జైలు శిక్ష తప్పడం లేదు.. ఇవి అన్ని ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తెచ్చిన రూల్సే అయినా.. అవి బ్రేక్‌ చేసినవారికి ఫైన్‌లు తప్పడం లేదు.. అది సరె.. కానీ, ఇప్పుడు నాకు ఫైన్‌ కట్టండి అంటూ.. ఓ వాహనదారుడు.. రోడ్డుపై బైఠాయించాడు.. .

Read Also: Chennai Drugs: చాక్లెట్ల మాటున డ్రగ్స్ దందా.. దాని విలువ రూ. 100 కోట్లు..

కరీంనగర్‌లో గుంతలు ఉన్న రోడ్డుపై కూర్చుని వాహనదారుడు నిరసన తెలిపారు.. నిబంధనలు పాటించకపోతే మాకు వేసే జరిమానాలు సరే.. మరి రోడ్లు బాగులేనందుకు మీరు నాకు ఎంత చెల్లిస్తారు జరిమానా అంటూ.. రేకుర్తి చౌరస్తా వద్ద రోడ్డుపై నిరసనకు దిగాడు కోట శ్యామ్ అనే ద్విచక్రవాహనదారుడు.. గుంతలు ఉన్న రోడ్డులో కూర్చుని నిరసన తెలిపాడు.. ఇక, వినూత్న రీతిలో నిరసన తెలిపిన కోట శ్యాంకుమార్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు నెటిజన్లు.. కాగా, వరుసగా కురుస్తోన్న భారీ వర్షాలు, వరదలతో చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి.. రోడ్లపై వాహనదారులు నరకం చూడాల్సిన పరిస్థితి..

Read Also: AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించిన సిట్.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం..!

సామాజిక కార్యకర్త అయిన కోట శ్యామ్ కుమార్, రేకుర్తి చౌక్ వద్ద కరీంనగర్-జగిత్యాల రహదారిలో దెబ్బతిన్న ప్రాంతంలో కూర్చుని, పట్టణంలోని రోడ్లను మరమ్మతు చేయడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపి ఒక ప్రత్యేక నిరసన కార్యక్రమం చేపట్టాడు.. హెల్మెట్ ధరించి, దెబ్బతిన్న రోడ్డుపై కూర్చుని ప్రయాణికుల దుస్థితిని గుర్తుచేసుకున్నారు. ప్రజలు ప్రభుత్వానికి వాహన పన్ను, రోడ్డు పన్ను మరియు అనేక ఇతర పన్నులు చెల్లిస్తున్నారని, హెల్మెట్లు లేదా సీటు బెల్టులు ధరించకపోవడం వంటి ఉల్లంఘనలకు జరిమానాలు విధిస్తున్నారని పేర్కొన్నారు.. అధికారులు జరిమానాలు వసూలు చేయడంలో చూపిస్తోన్న శ్రద్ధ.. దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేయడంలో చూపడంలేదని ఆరోపించారు. వాహనాలను దెబ్బతీయడమే కాకుండా, గుంతలు ఉన్న రోడ్లు ప్రజలను ఆరోగ్య సమస్యలకు గురి చేస్తున్నాయని, కలెక్టర్ మరియు పోలీసు కమిషనర్ రోడ్లను సరిచేయడంలో విఫలమైనందుకు పౌరులకు ఎంత జరిమానా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. అయితే, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఉన్నతాధికారులకు విషయం చెబుతామని చెప్పడంతో.. చివరకు ఆందోళన విమరించాడు శ్యాంకుమార్.. కానీ, ఈ వ్యవహారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..

https://www.youtube.com/shorts/i8kUzYUfvhc

Exit mobile version