NTV Telugu Site icon

Harish Rao: రేవంత్ దగ్గర సరుకు లేదు.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

Harish Rao 1

Harish Rao 1

బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్కి మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. మంకమ్మ తోట నుంచి రాంనగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి గంగుల, ఎంపీ అభ్యర్థి వినోద్ పాల్గొన్నారు. కరీంనగర్లో ఎమ్మెల్యే హరీష్ రావు డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కరీంనగర్లో చదువుకున్న విద్యార్ధిని నేను.. జరిగిన అభివృద్ధి చుస్తే నా రెండు కళ్ళు సరిపోతలేవన్నారు. బీఆర్ఎస్కు కరీంనగర్ పుట్టినిల్లు వంటిది.. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నపుడే కరీంనగర్ నుంచి హైదరాబాద్కు రైల్వేలైన్ మంజూరు చేపించారని తెలిపారు. జాతీయ రహదారులు సాధించింది వినోదన్న అని పేర్కొన్నారు.

Casting Call: యాక్టింగ్ లో ఒక్క ఛాన్స్ అంటూ వెయిట్ చేస్తున్నారా… ఇది మీ కోసమే

భావోద్వేగాలు రెచ్చగొట్టే బండి సంజయ్ ని గెలిపించారు.. ఆయన కరీంనగర్కు ఏమి చేశారని ప్రశ్నించారు. తెలంగాణకు ఏమిచ్చింది బీజేపీ.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు.. నిరుద్యోగం పెరిగింది నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదని చెప్పారు. మెడికల్ కాలేజ్ ఇవ్వాలంటే మొండి చెయ్యి చూపించారు.. కరీంనగర్ నర్సింగ్, మెడికల్ కాలేజ్లు తెచ్చామన్నారు. ఓడిపోయిన కరీంనగర్ అభివృద్ధి కోసం వినోద్ కుమార్ పని చేసారన్నారు. మరోవైపు.. కాంగ్రెస్ వచ్చిన 4 నెలలకే దినం తప్పి దినం నల్ల వస్తుందని తెలిపారు. 4 ఏళ్ళు కేసీఆర్ కరీంనగర్ ప్రజలకు నీళ్లు ఇచ్చారు.. తమను గెలిపిస్తే రేవంత్ రెడ్డి రూ.2 వేలు వేస్తామన్నారు.. రెండు వేలు పడితే కాంగ్రెస్ కు ఓటెయ్యండి.. లేకపోతే బీఆర్ఎస్కు ఓటు వేయండని తెలిపారు. సొల్లు మాటలు తప్పితే కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా చెప్తున్నారా? అని ప్రశ్నించారు. పరిపాలన చేతకాదు.. హామీలు అమలు చేయరని పేర్కొన్నారు.

Human Sacrifice: కలలో దేవత చెప్పిందని.. షాప్‌కీపర్‌ని నరబలి ఇచ్చిన మహిళ..

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తాను, కేసీఆర్ కలిసి ఢిల్లీలో 32 పార్టీల్లో 28 పార్టీలను ఒప్పించామన్నారు. 2014లో తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా తన కర్తవ్యాన్ని నిర్వహించానని తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల వ్యవహారాల్ని గట్టిగా పార్లమెంట్ లో వినిపించానని.. కరీంనగర్ నగరంలో సందు సందులో ఉన్న రోడ్లే తమ అభివృద్ధికి నిదర్శనం అని పేర్కొన్నారు. కరీంనగర్ కు త్రిబుల్ ఐటీ కోసం గొంతు చించుకున్నా కేంద్రంలోని బీజేపీ ఇవ్వలేదని చెప్పారు. 2019లో తాను గెలవకపోవడం వల్ల త్రిబుల్ ఐటీ సాకారం కాలేదని అన్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు రైల్వే లైన్ తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ దేనని తెలిపారు. ఎంపీగా సంజయ్ ఒక్క పని చేయలేదు.. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సంజయ్ ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు..? అని ప్రశ్నించారు.