NTV Telugu Site icon

Ponnam Prabhakar: త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు త్వరలో వస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడడం వల్ల వేడి వేడి పదార్థాలు కరిగి క్యాన్సర్‌కి కారణం అవుతున్నాయని తెలిపారు. ప్రతి ఊరిలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఫంక్షన్‌లో స్టీల్ వాడాలని సూచించారు. నేను ఎక్కడికి వెళ్ళినా స్టీల్‌ప్లేట్‌ తీసుకుపోయి అందులోనే తింటున్న అని తెలిపారు. త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు వస్తున్నాయిని తెలిపారు. కోతులతో పంటలకు ఇబ్బందులు అవుతున్నాయని అన్నారు. కోతుల సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.

Read also: Hyderabad: తాళం వేసిన ఇండ్లే టార్గెట్‌.. భూపాలపల్లిలో జరిగిందే.. కూకట్ పల్లిలో కూడా..

మరోవైపు మాస శివరాత్రి సందర్భంగా హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్ర స్వామిని దర్శించుకున్న పొన్నం స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి గోమూత్రం సమర్పించారు. కొత్తకొండలోని కొండపై ఉన్న పురాతన వీరభద్ర స్వామి ఆలయ మెట్లపై రూ.10 లక్షలతో శంఖుస్థాపన చేశారు. గ్రామంలో నూతన ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతతో ఉండాలన్నారు. తెలంగాణ సాధన కోసం ఎంతో మంది బలిదానాలు చేశారని, ప్రజలంతా ఉద్యమించారన్నారు.
Uttam Kumar Reddy: పది సంవత్సరాలు కళాశాలను నిర్లక్ష్యం చేశారు..