కొన్ని రోజుల క్రితం తెలుగు రాష్ట్రాలలో హల్‌చల్ చేసిన మహిళా అఘోరీ మళ్లీ ప్రత్యక్షమైంది. హిందూ సనాతన ధర్మ పరిరక్షణే తన ధ్యేయం అంటూ తెలుగు రాష్ట్రాల్ల పర్యటిస్తూ హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో సోషల్ మీడియాను సైతం ఓ ఊపు ఊపేసింది. కాగా.. సడన్‌గా కొన్ని రోజులు కనిపించకుండా పోయింది. తాజాగా.. కరీంనగర్‌లో హల్‌చల్ చేసింది. ఆ అఘోరిని చూసిన వాహనదారులు ఫోన్లలో వీడియో తీస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇంతకుముందు.. స్మశాన వాటికల్లో హంగామా చేసింది. ఒళ్ళు గగుర్పొడిచేలా పూజలు చేసేది.. అంతేకాకుండా అప్పుడే ఆరిన చితిపై కూర్చుని ఆ బూడిదను తన ఒంటిపై రుద్దుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అది చూసిన జనాలు భయాందోళనకు గురైన పరిస్థితులు ఉన్నాయి.
Read Also: India vs England 2nd T20: తిలక్ వర్మ విధ్వంసం.. ఇంగ్లాండ్‌పై భారత్ గెలుపు
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ బైపాస్ రోడ్డులో అఘోరీ హల్‌చల్ చేసింది. అఘోరీ కారు వెళ్తున్న సమయంలో ఆకతాయిలు వెంబడించడంతో వారితో వాగ్వాదం పెట్టుకుంది. రెండు రోజుల నుంచి కరీంనగర్‌లోని బైపాస్‌లోనే ఉంటుంది అఘోరీ. బైపాస్ రోడ్డు ద్వారా పెద్దపల్లి వైపు వెళ్తున్న అఘోరీని చూసి ఆకతాయిలు వెంబడించారు. కాగా.. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడినుంచి పెద్దపల్లి వైపు అఘోరిని పంపించారు పోలీసులు. ఆకతాయిలు కావాలనే తన కారును ఢీ కొట్టారంటూ అఘోరీ పోలీసులకు తెలిపింది. దీంతో.. పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది అక్కడి నుంచి పంపించారు.
Read Also: CM Chandrababu: బాలకృష్ణకు పద్మ భూషణ్.. చంద్రబాబు అభినందనలు