Site icon NTV Telugu

బండి సంజయ్ అరెస్ట్.. బీసీ కమిషన్ ముందు హాజరైన కరీంనగర్ సీపీ

కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో ఉపాధ్యాయ ఉద్యోగులకు మద్దతుగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ జాగరణ దీక్ష చేపట్టారు. దీంతో ఆయన చేపట్టిన దీక్షలో కోవిడ్ నిబంధనలు పాటించలేదని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ ఘటన తెలంగాణాలో హాట్ టాపిక్ గా మారింది. కరీంనగర్ లో బండి సంజయ్ అరెస్ట్, చోటు చేసుకున్న పరిణామాల పై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ బీసీ కమిషన్ ను ఆశ్రయించింది.

ఈ క్రమంలో కరీంనగర్ సీపీ సత్యనారాయణను గత వారం రోజుల క్రితం జాతీయ బీసీ కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే బీసీ కమిషన్ ముందు సీపీ సత్యనారాయణ హాజరు కాలేదు. దీంతో తదుపరి విచారణకు హాజరుకావాలని సూచించడంతో నేడు జాతీయ బీసీ కమిషన్ ముందు కరీంనగర్ సీపీ సత్యనారాయణ హాజరయ్యారు.

Exit mobile version