హుజురాబాద్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నియోజక వర్గంలో దళిత బంధు రెండో విడత రాని వాళ్లు తనకు దరఖాస్తు ఇవ్వాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. దరఖాస్తు ఇవ్వడానికి వచ్చిన వారితో కలిసి స్థానిక అంబేద్కర్ చౌరస్తాకు బయలుదేరిన కౌశిక్ రెడ్డిని పోలీసులు అడుకున్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కౌశిక్ రెడ్డి ధర్నాకు దిగేందుకు యత్నించారు. అనుమతి లేకుండా వందలాది మంది ఒక్కసారిగా అంబేడ్కర్ చౌరస్తా వద్దకు చేరుకోవడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేతో సహా పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Kamala Harris: ఇంకా 72 రోజులే కమల పదవీకాలం! నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం చెలరేగి.. తోపులాట జరిగింది. దీంతో.. కౌశిక్ రెడ్డి ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆయనను పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని గులాబీ పార్టీ డిమాండ్ చేసింది. మరోవైపు.. పోలీసులు కౌశిక్ రెడ్డిపై దాడి చేశారని పలువురు బీఆర్ఎస్ నేతలు అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అలాగే ఆందోళనకారులను వ్యానులో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు పోలీసులు. నిరసన నేపథ్యంలో వరంగల్- కరీంనగర్ జాతీయ రహదారిపై దాదాపు గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి.
Read Also: Suicide Attempt: ప్రేమ కోసం సెల్ టవర్ ఎక్కి యువకుడు ఆత్మహత్యాయత్నం