NTV Telugu Site icon

Bandi Sanjay: నేటి నుంచి బండి సంజయ్ తొలివిడత ప్రజాహిత యాత్ర.. మేడిపల్లి నుంచి షురూ..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ప్రజాహిత యాత్ర’ పేరుతో మొత్తం 119 కి.మీల మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పాదయాత్ర చేపట్టనున్నారు. సంజయ్ ఇవాల ఉదయం జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు కొండ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్‌లోని మేడిపల్లి గ్రామంలో తన మొదటి దశ ‘ప్రజాహిత యాత్ర’ను ప్రారంభించనున్నారు. ఆయన పాదయాత్ర మొదటి దశ ఫిబ్రవరి 15న ముగుస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పొడవునా ప్రజాహితమే లక్ష్యంగా…. కేంద్ర అభివ్రుద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా…. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై తిరిగి కాషాయ జెండా ఎగరేయడమే అంతిమంగా ఈ యాత్ర కొనసాగనుంది.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలను, వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో “ప్రజాహిత పాదయాత్ర” చేసేలా రూట్ మ్యాప్ ను సిద్ధమైంది. అందులో భాగంగా కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించి మేడిపల్లి కేంద్రం నుండి బండి సంజయ్ తన యాత్రను ప్రారంభించనున్నారు. నేటి నుండి 15 వరకు జరిగే యాత్ర తొలివిడతలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో చేపట్టనున్నారు. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లల్లిలో తొలివిడత ముగింపు సభను నిర్వహించనున్నారు. తొలిదశలో మొత్తం 119 కి.మీల మేరకు యాత్ర చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో యాత్ర చేయడంతోపాటు అధిక సంఖ్యలో గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో మమేకమవుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. నరేంద్రమోదీ ప్రభుత్వం గ్రామాల, పట్టణాల అభివ్రుద్దికి వెచ్చించిన నిధులను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తారు. ఈనెల 17, 18, 19 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఈనెల 20 నుండి మలి విడత యాత్రకు చేపట్టనున్నారు. మరోవైపు యాత్ర సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాలు, మున్సిపాలిటీల మీదుగా యాత్ర చేసేలా రూట్ మ్యాప్ రూపొందిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు బండి సంజయ్ యాత్రను కొనసాగించేలా బీజేపీ నేతలు షెడ్యూల్ ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.

Read also: Karnataka: వార్నీ.. ఆపరేషన్ థియేటర్లో ఫ్రీ వెడ్డింగ్ షూట్.. చివరికి..

తొలిరోజు సాగేదిలా…

తొలిరోజు కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేడిపల్లి మండల కేంద్రంలో బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం కొండాపూర్, రంగాపూర్, భీమారం, మన్నేగూడ, బొమ్మెన, దూలూరు, సిరికొండ, కథలాపూర్ వరకు యాత్ర చేస్తారు. యాత్రలో భాగంగా ఒక గ్రామం నుండి మరో గ్రామానికి వెళ్లే క్రమంలో వాహనంపై వెళతారు. గ్రామాల్లో మాత్రం పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకమవుతారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 3 రోజుల చొప్పున యాత్ర చేసేలా రూట్ మ్యాప్ ఖరారు చేశారు.
Auto Drivers: ఆటోడ్రైవర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.12 వేలు..!