NTV Telugu Site icon

Chinnamail Anji Reddy: బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ‘పట్టభద్రుల సంకల్ప యాత్ర’..

Chinnamail Anji Reddy

Chinnamail Anji Reddy

Chinnamail Anji Reddy: విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు ఉమ్మడి కరీంనగర్ – ఆదిలాబాద్ – మెదక్ – నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి.. తన నియోజకవర్గంలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.. అన్ని వర్గాల పట్టభద్రుల మద్దతు కూడగడుతున్నారు.. ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు కూడా.. అంజిరెడ్డి విజయాన్ని సులువు చేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. అయితే, రేపు అనగా ఫిబ్రవరి 8వ తేదీన కరీంనగర్‌ వేదికగా భారీ ర్యాలీ, సభకు ఏర్పాట్లు చేస్తున్నారు..

Read Also: Dhoni House: ధోనీ ఇళ్లు డిజైన్ చూశారా.. గోడపై జెర్సీ నెంబర్ 7, హెలికాప్టర్ షాట్

కరీంనగర్‌లో జరగనున్న పట్టభద్రుల సంకల్ప యాత్రకు రండి.. తరలిరండి.. అంటూ బీజేపీ పిలుపునిచ్చింది.. ఉమ్మడి కరీంనగర్ – ఆదిలాబాద్ – మెదక్ – నిజామాబాద్ పట్టభద్రుల ఓటరు లారా.. మన గళమై వస్తున్న మన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి గొంతును బలపరిచేందుకు.. మన హక్కుల సాధన కోసం.. మన శక్తిని ప్రదర్శించేందుకు రండి అని సూచించారు.. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కరీంనగర్‌లోని పద్మానగర్ నుంచి గీతా భవన్ సర్కిల్ వరకు సాగే పట్టభద్రుల సంకల్ప యాత్రకు భారీ సంఖ్యలో తరలిరండి అంటూ పిలుపు ఇచ్చారు బీజేపీ నేతలు.. ఇక, ఈ భారీ ర్యాలీ, సభకు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు.. ఎంపీలు ఈటల రాజేందర్‌, ధర్మపురి అరవింద్, రఘునందన్‌, డీకే అరుణ, కె. లక్ష్మణ్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. దిగ్విజయం చేయాలని కోరారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ చిన్నమైల్ అంజిరెడ్డి.