Karimnagar : కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై ఓవరాక్షన్.. సెలూన్ వర్కర్ పై దాడి

  • “అన్నా” అన్నందుకే ఆగ్రహం.. ఎస్సై దాడి
  • సెలూన్‌లో సీసీటీవీకి రికార్డైన ఘటన
  • సోషల్ మీడియాలో వైరల్.. పోలీసులపై విమర్శలు
  • చర్యలు తీసుకోవాలంటూ బాధితుడి విజ్ఞప్తి
Karimangar Si

Karimangar Si

Karimnagar SI assault : కరీంనగర్ జిల్లాలో పోలీస్ అధికారి అత్యుత్సాహం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ (SI), కేవలం తనను ‘అన్నా’ అని పిలిచినందుకు ఒక సామాన్య కార్మికుడిపై భౌతిక దాడికి దిగడం తీవ్ర కలకలం రేపింది. నగరంలోని ఖానాపూర్ ఏరియాలో ఉన్న ఒక సెలూన్‌కు కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై షేవింగ్ చేయించుకోవడానికి వెళ్లారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న రాము అనే వర్కర్, ఎస్సైని ఉద్దేశించి గౌరవంగా “కూర్చో అన్నా” అని పలికారు. అయితే, ఆ పిలుపు విని సదరు అధికారి ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు.

Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!

“నన్నే అన్నా అంటావా?” అంటూ మండిపడ్డ ఎస్సై, తన హోదాను అడ్డం పెట్టుకుని రాముపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఒక సామాన్యుడు తనను ‘అన్నా’ అని సంబోధించడం ఆ అధికారి అహంకారాన్ని దెబ్బతీసినట్లుగా ఆయన ప్రవర్తన ఉంది. సెలూన్‌లో అందరూ చూస్తుండగానే బాధితుడిపై చేయి చేసుకుని అసభ్య పదజాలంతో దూషించారు. ఈ దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలన్నీ సెలూన్‌లోని సిసిటీవీ (CCTV) కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఎస్సై వర్కర్‌ను కొట్టడం, దురుసుగా ప్రవర్తించడం వంటి విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు “ఇదేనా మీ ఫ్రెండ్లీ పోలీసింగ్?” అంటూ పోలీస్ శాఖపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సామాన్యులపై ఇలాంటి దాడులు పోలీస్ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, బాధ్యుడైన త్రీటౌన్ ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు , స్థానికులు కోరుతున్నారు.

Vastu Tips: మీ డైనింగ్ టేబుల్‌పై ఈ వస్తువులు పెడుతున్నారా? అయితే దరిద్రం మీ తలుపు తట్టడం ఖాయం!