సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన 2022 బడ్జెట్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సీఎం కేసీఆర్ రాజ్యాంగంలో మార్పులు రావాలని వ్యాఖ్యానించారు. దీనిని నిరసిస్తూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నేడు ఢిల్లీలో మౌన దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా మాజీ మేయర్ రవీందర్ సింగ్ పలు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ డ్రామాలు మానేయ్ అంటూ ఆయన మాట్లాడారు. భీమ్ దీక్ష అని పెట్టి అందులో ముఖ్యనేతలు పేర్లే పెట్టలేదని, రాజ్యాంగంలో ఒక్క ఆర్టికల్ పై మాట్లాడే ధైర్యం చెయ్ అని ఆయన సవాల్ విసిరారు.
రాష్ట్ర అధ్యక్షుడు గా కేంద్రం నుండి ఏమి తెచ్చావు బండి సంజయ్ అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఒక్కటైన సంక్షేమ పథకాలు ఉన్నాయా అని ఆయన అన్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు ఉన్నాయి ఎవరి బలమెందో చూసుకుందామని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ గెలవడు.. దళితులకు గౌరవం ఇవ్వవు కమిటీని ఎంపీలనే పట్టించుకోవు బండి సంజయ్.. దీక్షలు పేరుతో పబ్బం గడుపుతున్నారు బీజేపీ వాళ్ళు అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. బండి సంజయ్ రచ్చ కోసం చూస్తే మేము చర్చ కోసం చూస్తామని ఆయన అన్నారు.