Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
- ప్రజావాణి ఆడిటోరియంలో ఊడిపడ్డ పీఓపీ షీట్
- కింద ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
- మరో 20 షీట్లు ప్రమాదకరంగా వేలాడుతున్న వైనం
- తక్షణమే మరమ్మతులు చేపట్టాలని అర్జిదారుల డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ప్రజావాణి ఆడిటోరియంలో సోమవారం ఉదయం ఒక పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారాంతపు ‘ప్రజావాణి’ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతున్న సమయంలో, ఆడిటోరియం పైకప్పుకు ఉన్న ఒక పీఓపీ (POP) సీలింగ్ షీట్ ఒక్కసారిగా ఊడిపోయి కిందపడింది. అయితే, ఆ షీట్ పడిన సమయంలో కింద ఉన్న కుర్చీలో ఎవరూ కూర్చోకపోవడంతో అధికారులు, అర్జిదారులు తీవ్ర ఉపశమనం పొందారు. ఒకవేళ ఆ సమయానికి అక్కడ ఎవరైనా ఉండి ఉంటే తీవ్ర గాయాలయ్యేవని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ప్రమాదకరంగా మరో 20 షీట్లు.. వికలాంగుల కౌంటర్ వద్దే ముప్పు
ఈ సంఘటనతో కలెక్టరేట్ ఆడిటోరియం భద్రతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆడిటోరియంలో దాదాపు 15 నుంచి 20 పీఓపీ సీలింగ్ షీట్లు అత్యంత ప్రమాదకరంగా వేలాడుతున్నట్లు అధికారులు, ప్రజలు గుర్తించారు. అవి ఏ క్షణంలోనైనా ఊడిపడే అవకాశం ఉండటంతో ఆడిటోరియంలోకి వచ్చే ప్రతి ఒక్కరిలోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థానం వద్ద, స్వయంగా జిల్లా కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించే ప్రదేశానికి సరిగ్గా పైననే ఒక పీఓపీ షీట్ ఊడిపోవడానికి సిద్ధంగా ఉండటం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
Also Read
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని డిమాండ్
ప్రతి సోమవారం జరిగే ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది ప్రజలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. ఈ నేపథ్యంలో భయాందోళనల నడుమ కార్యక్రమాలు నిర్వహించడం సరైంది కాదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి, ప్రమాదకరంగా ఉన్న పీఓపీ సీలింగ్ షీట్లను తక్షణమే తొలగించి, ఆడిటోరియంలో అవసరమైన మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కలెక్టరేట్‌కు వచ్చిన అర్జిదారులు, అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?