NTV Telugu Site icon

Bear Roaming Roads: 12గంటల ఆపరేషన్.. ఎట్టకేలకు చిక్కిన ఎలుగుబంటి

Karimnagar Bear Roaming Roads

Karimnagar Bear Roaming Roads

Bear Roaming Roads: కరీంనగర్‌ లో ఎలుగుబండి హల్ చల్‌ చేసింది. రాత్రి ఎలుగుబండి రోడ్డుమీదకు పరుగులు పెట్టింది. దీంతో నగర ప్రజలు భయాందోళనతో పరుగులు పెట్టారు. ఎలుగు బండి మెరాయిస్తూ రోడ్లపై, జనావాసంలో పరుగులు పెడుతుండటంతో స్థానికులు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలుగు బండి ఏం చేస్తుందో అన్నట్లు బిత్తరపోయి చూస్తు ఉండిపోయారు. కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి రాత్రి నుంచి ఎలుగు బంటిని పట్టుకునేందుకు నానా తంటాలు పెట్టారు. ఉరుకులు పరుగులు పెడుతున్న ఎలుగుబండిని పట్టుకునేందుకు దారుల్లో పరుగులు పెట్టారు. రాత్రి కావడంతో అధికారులకు కాస్త జాప్యం ఏర్పడింది.

Read also: Charminar: ఛీ..ఛీ.. చార్‌మినార్‌ పై ఏంట్రా ఇలా చెలరేగిపోతున్నారు..!

అర్థరాత్రి ఎలుగుబంటిని పట్టుకునేందు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇళ్ల తలుపులు వేసుకుని ఉండాలని, ఎవరూ బయటకు రాకూడదని సూచించారు. దీంతో ప్రజలు బిక్కు బిక్కు మంటూ రాత్రంగా గడిపారు. ఇక మళ్లీ తెల్లవారు జామునుంచి ఎలుగు బంటిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు అధికారులు. ఎలుగు బంటికి పట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసిన ఫలితం కనిపించకపోవడంతో చివరకు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి బంధించారు సుమారు 12 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్‌లో అధికారులు ఎలుగు బంటిని ఎట్టకేలకు పట్టుకున్నారు. ఎవరికి ఎటువంటి హాని జరగక పోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
TSRTC: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త.. సుదూర ప్రాంతాలకు స్పెషల్ ట్రిప్పులు