NTV Telugu Site icon

Kamareddy: తోటి విద్యార్థినిల వేధింపులు.. ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్యాయత్నం

Suicide Attempt

Suicide Attempt

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రామారెడ్డి మండలం స్కూల్ తండాలో ఇద్దరు విద్యార్థినిలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తరగతి గదిలో తోటి విద్యార్థినిల వేధింపుల వల్ల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. స్కూల్ ఆవరణలోనే విద్యార్థినులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డట్టు సమాచారం. కాగా.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంజన ఆరవ తరగతి విద్యార్థిని, బిందు మూడో తరగతి తరగతి విద్యార్థినిగా గుర్తించారు. వీరిద్దరూ అక్కా చెల్లెలు. వీరిని చికిత్స నిమిత్తం కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.