Mohammed Shabbir Ali: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెరువు ముంపు ప్రాంతంలో వద్దన్నా అక్కడే డబుల్ బెడ్ నిర్మాణాలు చేపట్టారని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల భాదితుల పరామర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెరువు ముంపు ప్రాంతంలో వద్దన్నా అక్కడే డబుల్ బెడ్ నిర్మాణాలు చేపట్టారు. బీఆఎస్ ప్రభుత్వం పేద ప్రజల జీవితాలతో ఎలా అడుకుందో ఇదే ఉదాహరణ అన్నారు. 17 మంది బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.
Read also: CM Revanth Reddy: అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం..
తక్షణ సహాయం కింది షబ్బీర్ అలీ ద్వారా ఒక్కో కుటుంబానికి 2 వేల రూపాయలు, పిల్లలకు బట్టలు పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో ఉదృతంగా వర్షాలు కురిస్తే కేటీఆర్ అమెరికాలో ఉండి, వాళ్ళ తండ్రి ఫాం హౌస్ లో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి బాధితులకు డబుల్ బెడ్ రూం ల వద్ద నీరు తగ్గే వరకు వసతి ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయంలో అన్ని డబుల్ బెడ్ రూంలు బఫర్ జోన్ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. అధికారులతో చర్చించి ఆ నిర్మాణాలను కూల్చివేస్తామన్నారు.
Jagadish Reddy: తూములను లాక్ చేయడం వల్లే ఎడమ కాలువ తెగింది..