Kamareddy: దారుణం.. డబ్బులు కట్టలేదని వేసిన కుట్లు విప్పేశారు..
- గాయాలతో వెళ్లిన వ్యక్తిపై ఆసుపత్రి సిబ్బంది దారుణం..
- డబ్బులు కట్టలేదని వేసిన కుట్లు విప్పేసిన వైనం..
- కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణమైన ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamareddy: గాయాలకు కుట్లు వేసినందుకు డబ్బులు చెల్లించకపోవడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది రోగిపై దాడి చేసి, కుట్లు విప్పేశారు. రోగికి నరకం చూపించిన ఘటన కామారెడ్డి పట్టణంలోని అపెక్స్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి బైక్‌పై వెళుతూ అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో శ్రీను తీవ్రంగా గాయాలు కావడంతో పట్టణంలోని అపెక్స్ ఆస్పత్రికి వెళ్లాడు. కన్సల్టేషన్ ఫీజు కింద రూ.300 చెల్లించాడు. ఆస్పత్రి సిబ్బంది అతని గాయాలకు కుట్లు వేసి.. వెయ్యి రూపాయలు బిల్లు వేశారు. అయితే బాధితుడి వద్ద నగదు లేకపోవడంతో క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు చెల్లిస్తానని చెప్పాడు. ఆస్పత్రి సిబ్బంది దీనికి అంగీకరించకపోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆస్పత్రి సిబ్బంది బాధితుడితో పాటు అతడి స్నేహితులపై దాడికి పాల్పడ్డారు.
ఈ చర్యతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరికి రోగికి వేసిన కుట్లు విప్పేసి ఆస్పత్రి నుంచి బయటకు పంపించారు. దీంతో శ్రీను నరకయాతన చూశాడు. కుట్లు విప్పందంటూ వాపోయాడు. అయినా ఆస్పత్రి సిబ్బంది వినలేదు.. డబ్బులు కడితే కుట్లు విప్పమని లేదంటే ఇలాగే ఉంటుందని నరకం చూపించారు. కాసులకు తప్పా కనికరం చూపించని ఆస్పత్రి సిబ్బంది తీరుపై బాధితుడు ఆందోళనకు దిగాడు. సుమారు అరగంటపాటు అతని ఆందోళన కొనసాగింది. అనంతరం బాధితుడు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నాడు. అయితే ఈ ఘటనపై అధికారులు పట్టించుకోవాలని డిమాండ్ చేశాడు. రోగులపై కనికరం చూపించిన ఇలాంటి ఆస్పత్రులపై వేటు వేయాలని కోరారు.
Water Supply: నగరంలో 24 గంటల పాటు నీటి సరఫరా బంద్..
Also Read
- Kamareddy: ఎంతకు తెగించార్రా.. నగలు తీసేందుకు సమయం లేక.. ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లిన దొంగలు(వీడియో)
- Illicit Affair: మహిళతో అన్న అక్రమ సంబంధం.. పెళ్లి కోసం చంపేసిన తమ్ముడు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం.. పశువులపై వరుస దాడులు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత.. ప్రత్యర్థి కుటుంబంపై ట్రాక్టర్‌తో దాడి
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?