Water Supply: నగరంలో 24 గంటల పాటు నీటి సరఫరా బంద్..
- భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం మంచినీటి సరఫరా నిలిపివేసిన అధికారులు..
- ప్రకటించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీనరేజ్ బోర్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Water Supply: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీనరేజ్ బోర్డ్ ప్రకటించింది. కృష్ణా ఫేజ్-3 రింగ్ మెయిన్ 1 కింద ప్రశాసన్ నగర్, అయ్యప్ప సొసైటీ మధ్య మంచి నీటి సరఫరా చేసే ప్రధాన పైపులైన్ పలు ప్రాంతాల్లో భారీ లీకేజీలు ఏర్పడింది. దీంతో హకీంపేట, గోల్కండ, టోలీచౌక్, లంగర్ హౌజ్, షేక్ పేట, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, తాటి ఖానా, కొండాపూర్, డోయెన్స్ కాలనీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో నేడు మంచి నీటి సరఫరా ఉండదని స్పష్టం చేశారు. ప్రశాసన్‌నగర్ నుంచి అయ్యప్ప సొసైటీ వరకు 1200 డయా పీఎస్పీ గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్ చాలా చోట్ల లీకేజీలు ఏర్పడినట్లు పేర్కొంది. దీంతో సోమవారం పైపులైన్ మరమ్మతు పనులు చేపడతామని చెప్పారు. సోమవారం ఉదయం 6.00 గంటల నుంచి 24 గంటల పాటు అంటే మంగళవారం ఉదయం వరకు మరమ్మతు పనులు కొనసాగుతాయని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీనరేజ్ బోర్డ్ స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాల ప్రజలు మంచినీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని వాటర్ వర్క్ అధికారులు సూచించారు. మళ్లీ యదావిధిగానే మంగళవారం ఉదయం నుంచి నీటి సరఫరా ఉంటుందని తెలిపారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.
Hydra Focus: హడలెత్తిస్తున్న హైడ్రా.. నేడు గుట్టల బేగంపేట్ పరిధిలో కూల్చివేతలు..!
Also Read
- చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
- Hyderabad Rains: రెండు నెలల తర్వాత హైదరాబాద్‌లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్
- Musi Rejuvenation Project : గోదావరి నీటితో నిండనున్న జంట జలాశయాలు.. హైదరాబాద్‌కు కొత్త కళ..
- Omega Hospitals : దేశవ్యాప్తంగా ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పిడుగు... 24 చోట్ల ఏకకాలంలో విస్తృత సోదాలు..!
తాజావార్తలు
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!