Pawan Kalyan: కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేవారు. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. కుటుంబ సభ్యుడు మరణించడంతో దశదిన కర్మలో భాగంగా అంగడి దింపుడు కార్యక్రమానికి ఎల్లారెడ్డి పట్టణం సంతకు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా హాసన్ పల్లి గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడంతో పాటు మరో 14మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో పిట్లం మండలం చిల్లర్గికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు మరణించారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమాదానికి కారణం అతివేగమే అని తెలుస్తుందని… గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులపై వేగాన్ని అదుపు చేయడానికి రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా, వైద్యపరంగా ఆదుకోవాలి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ… మృతుల కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Also Read
- Kamareddy: ఎంతకు తెగించార్రా.. నగలు తీసేందుకు సమయం లేక.. ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లిన దొంగలు(వీడియో)
- Illicit Affair: మహిళతో అన్న అక్రమ సంబంధం.. పెళ్లి కోసం చంపేసిన తమ్ముడు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం.. పశువులపై వరుస దాడులు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత.. ప్రత్యర్థి కుటుంబంపై ట్రాక్టర్‌తో దాడి
తాజావార్తలు
-
Pakistan Coal Mine Blast: బొగ్గు గనిలో భారీ పేలుడు.. 32 మంది కార్మికులు మృతి
-
Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు.. చికిత్స పొందుతూ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
-
PM Modi: పార్లమెంట్ ఉభయ సభల్లో యాంటీ-పేపర్ లీక్ బిల్ పాస్.. మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోడీ
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్‌గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!