గుండెపోటుతో రోజు ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా.. చాలా మంది హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. రోజుకు కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోతున్న సంఘటనలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. కొందరు డ్యాన్స్ చేస్తూ, సినిమా చేస్తూ, వాకింగ్ చేస్తూ.. ఇలా చాలా సందర్భాలలో గుండెపోటుతో చాలా మంది చనిపోతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో గుండెపోటుతో చనిపోయిన ఘటన తీవ్ర విషాదంగా మారింది.
Read Also: Home Minister Anitha: మహిళల రక్షణకు స్పెషల్ వింగ్, ప్రత్యేక యాప్..!
వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లాలో కూతురు పెళ్లిలో గుండెపోటుతో ఓ తండ్రి కుప్ప కూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడు. బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి బి.టి.ఎస్. సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంతోషంగా పెళ్లి కార్యక్రమం నడుస్తుంది.. ఇంతలో పెళ్లి కూతురు తండ్రి గుండెపోటుతో మరణించడంతో అక్కడ విషాదంగా మారింది. కూతురు కాళ్ళు కడిగే సమయంలో ఒక్కసారిగా గుండెపోటుతో కుప్ప కూలాడు తండ్రి బాల చంద్రం. దీంతో.. అక్కడున్న బంధువులు అతన్ని ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందారు. దీంతో.. పెళ్లి కళ్యాణ మండపంలో విషాదం నెలకొంది.
Read Also: IND vs PAK: పాకిస్తాన్ గెలుస్తుంది.. ఐఐటీ బాబా జోస్యం