Kamareddy: కామారెడ్డిలో బీజేపీ ఘన విజయం సాధించింది. రాష్ట్ర ప్రజలే కాకుండా, దేశం మొత్తం కామారెడ్డి నియోజకవర్గంపై ఆసక్తి కనబర్చాయి. సీఎం కేసీఆర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థిగా చెప్పబడుతున్న రేవంత్ రెడ్డిని బీజేపీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డి ఓడించారు. ముందు నుంచి అనుకుంటున్నట్లుగా ఈ సీటులో హోరాహోరీ పోరు జరిగింది. క్షణక్షణానికి, రౌండ్ రౌండ్‌కి ఆధిక్యం మూడు పార్టీల మధ్య మారుతూ వచ్చింది. చివరకు కామారెడ్డి ఓటర్ స్థానిక అభ్యర్థికే పట్టం కట్టారు. ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించి బీజేపీ అభ్యర్థి చరిత్ర సృష్టించారు. 6 వేల ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి సీఎం కేసీఆర్‌ని ఓడించారు. రేవంత్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు.
Read Also: Telangana Elections Results: మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టే ఎమ్మెల్యేలు ఎవరో తెలుసా..!
స్థానికంగా అందుబాటులో ఉండటంతో పాటు ప్రజలతో మంచి సంబంధాలు ఉన్న రమణారెడ్డి వైపే కామారెడ్డి ఓటర్ మొగ్గు చూపారు. మరోవైపు కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఇద్దరూ కూడా నాన్ లోకల్ కావడం కూడా బీజేపీకి కలిసి వచ్చింది. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఇద్దరూ కామారెడ్డితో పాటు గజ్వేల్, కోడంగల్‌లో పోటీ చేశారు. అయితే కామారెడ్డిలో గెలిచినా కూడా తర్వాత వారి సొంత నియోజకవర్గాలకు వెళ్తారని ప్రజలు భావించినట్లు తెలుస్తోంది. దీంతో కామారెడ్డి ప్రజలు బీజేపీ అభ్యర్థి రమణారెడ్డి వైపే మొగ్గు చూపారు. దీనికి తోడు స్థానికంగా ఉన్న పరిస్థితులు కూడా బీజేపీకి కలిసివచ్చాయి.