Kamal Chandra Bhanj Deo: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో కాకతీయ వారసుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘కాకతీయ వైభవ సప్తాహం’ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సందడి చేసింది. ఈ ఛాలెంజ్‌లో కాకతీయ 22వ వారసుడైన కమల్ చంద్రభంజ్ దేవ్ పాల్గొని, స్వయంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాకతీయుల పాలనలో తమ పూర్వీకులు ప్రకృతికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని, అందులో భాగంగానే గొలుసు చెరువులు తవ్వించారని చెప్పారు.
అడవుల్ని రక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారని, ఇప్పుడు ఆ ఒరవడి కేసీఆర్ ప్రభుత్వంలో కనిపిస్తోందని కమల్ చంద్రభంజ్ దేవ్ అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటివి తన మనసుకు చాలా దగ్గరైన పథకాలని వెల్లడించారు. ముఖ్యంగా.. జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన మొక్కలు నాటే కార్యక్రమం చాలా దూరదృష్టితో తీసుకున్న కార్యక్రమమన్నారు. మనం బాగుండటమే కాకుండా మన భవిష్యత్ తరాలు బావుండాలని ఆయన తలపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. యావత్ దేశ ప్రజలంతా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాలని కమల్ చంద్రభంజ్ దేవ్ కోరారు.
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
ఈ సంధర్భంగా.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఒక ప్రకటనలో కమల్ చంద్ర భంజ్ దేవ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీరు చూపించిన చొరవ కోట్లమందికి స్పూర్తిగా నిలుస్తుందని.. తెలంగాణ పట్ల మీకున్న ప్రేమ, అభిమానం అద్భతమని పేర్కొన్నారు. కాగా.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, నగర మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!