Site icon NTV Telugu

MP K.Laxman : మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బీఆర్‌ఎస్‌ కూలింది

Laxman

Laxman

MP K.Laxman : బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ కాళేశ్వరం అవినీతి కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బిఆర్ఎస్ కూలింది. కాళేశ్వరం మూడు పిల్లర్లు కూలిపోతే, బిఆర్ఎస్ మూడు ముక్కలైంది” అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే, ఈ నిర్ణయం తీసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి 22 నెలలు ఎందుకు ఆలస్యం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆధారాలు ఉన్నాయని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఆ ఆధారాలను సీబీఐకి సమర్పించి దర్యాప్తుకు సహకరించాలని లక్ష్మణ్ సూచించారు.

Delhi: ఢిల్లిలో అక్రమ ఆయుధాల కర్మాగారం.. పట్టుకున్న పోలీసులు..

సీబీఐ విచారణలో ఎవరైనా ఉన్నా శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. “కాగ్ నివేదిక, విజిలెన్స్ రిపోర్టులు అన్నీ అవినీతి స్పష్టంగా చూపిస్తున్నాయి. అయితే ఘోష్ కమిటీ రాజకీయ, అధికారుల, కాంట్రాక్టర్ల పాత్రను తేల్చలేకపోయింది. కవితే స్వయంగా హరీష్ రావు, సంతోష్ అవినీతికి పాల్పడ్డారని చెప్పింది. వారిని ‘ఆనకొండలు’గా సంబోధించింది. అలా అయితే కేసీఆర్ కూడా అవినీతిలో భాగస్వామే కాదా?” అని ప్రశ్నించారు. “రాష్ట్రం కోసం వేలాది మంది యువత, ఉద్యోగులు, ప్రజలు పోరాటం చేశారు. అమరుల త్యాగాలను కేసీఆర్ కుటుంబం క్యాష్ చేసుకుంది. తెలంగాణ ఆస్తులను బిఆర్ఎస్ కొల్లగొట్టింది. అవినీతి పరులకు బీజేపీలో స్థానం లేదు. కఠినంగా శిక్షించాలి” అని లక్ష్మణ్ అన్నారు.

పావురాల గుట్టలో ఆ రోజు నిజంగా ఏం జరిగింది..? వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం నిజాలు

Exit mobile version