నేడు కాకతీయ వైభవ సప్తాహం ప్రారంభించేందుకు కాకతీయ 22వ యువరాజు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ ఓరుగుల్లు చేరుకున్నారు. అయితే.. ముందుగా ఆయన హనుమకొండలోని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల నేపథ్యంలో.. మొట్టమొదటిసారి ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, అమ్మవారి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా కమల్‌చంద్ర భంజ్‌దేవ్ మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
కాకతీయ 22వ యువరాజు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ ను అంతకుముందు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్‌లు కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌కు ఘనస్వాగతం పలికారు. నేటినుంచి ఓరుగల్లు కోటలో వారం పాటు జరగనున్న కాకతీయ వైభవ సప్తాహాన్ని కమల్‌చంద్ర ప్రారంభించనున్నారు. ఓరుగల్లు వేయిస్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, పద్మాక్షీ గుట్ట, కాకతీయ తోరణాన్ని సందర్శించనున్నారు. ఈవేడుకలను పురస్కరించుకుని విద్యార్థులకు నాటకాలు, సదస్సులు, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. అయితే.. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని మరోమారు ప్రపంచానికి చాటేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈనేపథ్యంలో.. నేటి నుంచి ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
తెలంగాణా ఏర్పడిన తర్వాత తొలిసారి:
అయితే.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరిసారిగా 2012 డిసెంబర్ 21 వ తేదీ నుంచి మూడు రోజులపాటు కాకతీయ ఉత్సవాలను నిర్వహించారు. కాగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2017- 2018 లో ఓరుగల్లు కళావైభవం పేరుతో ఉత్సవాలు కొనసాగి, రామప్ప దేవాలయం నిర్మించి 800 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈనేపథ్యంలో తాజాగా కాకతీయ వైభవ సప్తాహం పేరుతో మరోసారి నేటి నుండి ఈ నెల 13వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
వేడుకల షెడ్యూల్ ఇలా
నేడు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ మాదాపూర్ లో ఛాయాచిత్ర ప్రదర్శన ఆవిష్కరణ ఉత్సవం జరుగుతుంది. రేపు 8వ తేదీ వేయిస్తంభాల దేవాలయంలో సాయంత్రం 5 గంటలనుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఎల్లండి 9వ తేదీ భద్రకాళీ బండ్ పై ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. ఇక 10న పబ్లిక్ గార్డెన్ టౌన్ హాల్ లో పెయింటింగ్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు 11వ తేదీన అంబేద్కర్ భవన్ లో ఉదయం 10 గంటలకు షార్ట్ ఫిలిం ఫెస్టివల్.. అలాగే నల్గొండ జిల్లా చందుపట్ల, నకిరేకల్ లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇక 12వ తేదీన ఖిల్లా వరంగల్ లో కార్నివాల్ , ఫుడ్ ఫెస్టివల్ సాయంత్రం ఐదు గంటల నుండి నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో చివరి రోజు 13న రామప్ప ఆలయం వద్ద కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శనలతో వేడుకలకు ముగింపు పలకనున్నారు. ఈనేపథ్యంలో.. వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Harassment : మహిళలకు అసభ్యకర వీడియోలు.. దర్యాప్తులో షాకింగ్ నిజాలు..