నేడు కాకతీయ వైభవ సప్తాహం ప్రారంభించేందుకు కాకతీయ 22వ యువరాజు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ ఓరుగుల్లు చేరుకున్నారు. అయితే.. ముందుగా ఆయన హనుమకొండలోని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల నేపథ్యంలో.. మొట్టమొదటిసారి ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, అమ్మవారి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా కమల్‌చంద్ర భంజ్‌దేవ్ మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. కాకతీయ 22వ యువరాజు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ ను…