టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ నిన్నటిరోజున బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి ధర్మేంధ్రప్రధాన్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. కాగా, ఈరోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు. బీజేపీలో చేరిన ఈటలపై టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. తొలిరోజే ఈటలకు పరాభవం ఎదురైందని, నడ్డా సమక్షంలో ఈటల ఎందుకు చేరలేదని విమర్శించారు. కమ్యునిస్టుల భావజాలం ఎక్కడపోయిందని, ఆస్తులను కాపాడుకోవడానికే ఈటల బీజేపీలో చేరారని అన్నారు. టీఎంసీలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేసి బీజేపీ విఫలం అయిందని అన్నారు. తెలంగాణలోనూ అస్థిరత్వం తెచ్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని, తెలంగాణ ప్రజల ఆదరణ టీఆర్ఎస్‌కే ఉందని అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో వేరే వారికి స్థానం లేదని, కాంగ్రెస్ ఇప్పటికే తుడిచిపెట్టుకుపోయిందని కడియం విమర్శంచారు.
ఈటలపై కడియం కీలక వ్యాఖ్యలు… ఆస్తులు కాపాడుకునేందుకే…
