NTV Telugu Site icon

KA Paul: నిన్నే పీకేతో మాట్లాడా.. కేసీఆర్‌కు వచ్చేవి 28 సీట్లే..!

Ka Paul

Ka Paul

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. నిన్న తనపై దాడి జరిగిన తర్వాత ఆగ్రహంతో ఊగిపోతున్న ఆయన.. ఇవాళ మీడియా సమావేశం పెట్టి టీఆర్ఎస్‌ నేతలు, సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌పై ధ్వజమెత్తారు.. కేసీఆర్, కేటీఆర్ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టు చేస్తున్నారని.. నిన్న సిరిసిల్ల ఎస్పీతో కేటీఆర్ మాట్లాడిన తర్వాత నాపై దాడి జరిగిందని ఆరోపించారు. ముందు 15 – 20 మంది పోలీసులు వచ్చి నన్ను ఆపారు.. వెంటనే డీఎస్పీ, సీఐ వచ్చారని.. నన్ను కొట్టిన వ్యక్తితో పోలీసులు బ్లూ టూత్‌తో మాట్లాడారని.. తర్వాతే దాడి జరిగిందని చెప్పుకొచ్చారు.. నన్ను కొట్టింది కేటీఆర్ మనిషి.. నేను రైతులను దూషించలేదు.. పోలీసులు అధికార పార్టీ కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు.

Read Also: MMTS: గుడ్‌న్యూస్‌.. టికెట్‌ ధరలు తగ్గించిన ఎంఎంటీఎస్..

ఇక, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌తో కూడా మాట్లాడినట్టు తెలిపారు కేఏ పాల్.. నిన్న నేను పీకేతో మాట్లాడానన్న ఆయన.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ… టీఆర్ఎస్‌కు 28 స్థానాలకంటే ఎక్కువగా రావు అని కేసీఆర్‌తో పీకే చెప్పినట్టు కేఏ పాల్‌ చెప్పుకొచ్చారు.. మరోవైపు, ప్రశాంత్‌ కిషోర్‌ను పార్టీ పెట్టమని కేసీఆరే చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ పెట్టి అన్ని పార్టీలను కలుపు అని చెప్పాడని కేఏ పాల్‌ వెల్లడించారు.