NTV Telugu Site icon

K. A. Paul: ప్రధాని మోడీపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు..

Ka Paul

Ka Paul

ఒడిశా రాష్ట్రంలోని బాలసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించి.. పదవికి రాజీనామా చేసి ప్రైమ్ మినిస్టర్ గా అమిత్ షాకి అవకాశం ఇవ్వాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రైవేటీకరణ పేరుతో దేశాన్ని నరేంద్ర మోడీ అమ్మేశారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ దేశమంతా ఓటమి పాలు అయ్యింది.. అన్ని చోట్ల కాంగ్రెస్ పతనం అయ్యింది.. మరో 50 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అధికారంలోకి రాదు అంటూ కేఏ పాల్ అన్నాడు.

Also Read: Adipurush: రాముడి కోసం తిరుపతికే అయోధ్య…

కర్ణాటకలో మా మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నాడు. తెలంగాణలో కాంగ్రెస్ లో పదిమంది ముఖ్యమంత్రులు బయలుదేరారు అంటూ పాల్ విమర్శించారు. జై సీఎం అంటున్నారు.. హుజూరాబాద్ లో మూడు వేల ఓట్లు కూడా పడలేదు.. పొంగులేటి పార్టీలు మారాడు.. వైసీపీ, బీఆర్ఎస్ లకు వెళ్లి వచ్చాడు.. మీరు పార్టీ పెట్టడం వల్ల ఒక్క సీటు గెలవరు అంటూ ఆయన వ్యాఖ్యనించాడు.

Also Read: Odisha Train Accident: ప్రమాదానికి కారణం ఇదే.. కీలక విషయాలు వెల్లడించిన రైల్వే మంత్రి

కర్ణాటకలో లక్ష కోట్లు ఉన్న గాలి జనార్థన్ రెడ్డి కుడా అక్కడ సక్సెస్ కాలేదు అని కేఏ పాల్ గుర్తు చేశారు. రెడ్లు అందరూ బీసీ, ఎస్సీలకు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ అప్పులు తీర్చి అభివృద్ధి చేయాలన్న కోరిక ఉంది అన్నారు. ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి వస్తే.. ఆరునెలలు మాత్రమే తెలంగాణ సీఎంగా ఉంటాను అంటూ కామెంట్స్ చేశాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే ఎలా అభివృద్ధి చేయగలరు అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు.

Also Read: Srikantachari’s mother: యాదాద్రి జిల్లా కలెక్టరేట్ లో శ్రీకాంత చారి తల్లికి సన్మానం

పొంగులేటి ప్రజాశాంతి పార్టీలో చేరితే నేను సీఎంగా.. మీరు ఉప ముఖ్యమంత్రి అవుతారు అంటూ కేఏ పాల్ అన్నాడు. ఇక చంద్రబాబు ఢిల్లీ టూర్ పెద్ద డ్రామా అంటూ కామెంట్స్ చేశాడు. నిన్నటి వరకు నా మిత్రుడు అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదు.. ఇప్పుడు జగన్ ను ఓడించేందుకు బాబు కుట్రలో భాగమే ఈ భేటీ అని విమర్శించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు.. బాబుకి 25 సార్లు గురువును.. ఆయన తల మీద 22 సార్లు అశీర్వదించాను అంటూ పాల్ వ్యాఖ్యనించాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ జాగ్రత్తగా ఉండాలి.. వారికి ప్రమాదం పొంచి ఉంది అని కేఏ పాల్ కామెంట్స్ చేశారు.