గవర్నమెంట్ ట్యాక్స్ ఏగ్గొట్టిన గ్రానైట్ పరిశ్రమల అధినేత వద్దిరాజు రవిచంద్రకు రాజ్య సభ సిటా… సిగ్గు ఉందా కెసిఆర్ అంటూ ఫైర్‌అయ్యారు. వీళ్ళకి సీట్ ఇవ్వడం కంటే డాన్ దావుద్ ఇబ్రహీంకు ఇవ్వడం బెటర్అంటూ నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
బ్యాంక్ రుణాలు, టాక్స్ లు ఎగ్గొటిన్న మైనింగ్ డాన్ రవిచంద్రకి సీటా.? అంటూ ప్రశ్నించారు. పార్టీలు మారి చివరకు మీ పార్టీలోకి వచ్చిన సీనియర్ దళిత నాయకుడికి ఎందుకు ఇవ్వరు.? అని మండిపడ్డారు. సీట్ ల కోసం పార్టీలు మారిన వారు టీఅర్ఎస్ లో వందమంది ఉన్నారు.. సిగ్గుందా మీకు.? అంటూ విమర్శించారు. గత 40 రోజులుగా ప్రెస్ మీట్స్., నియోజక వర్గాల టూర్స్ చేస్తున్న.. ఢిల్లీ నుండి గల్లీ వరకు తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్నానని అన్నారు.
తెలుగు ప్రజలకు కెసిఆర్., కేటీఆర్ నిజస్వరూపం బయట పడిందని కొనియాడారు. పోలీసులతో మా పై నిన్న దాడి చేసి నిన్న మా శాంతి సభ జరగకుండా చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ., అమరవీరుల ద్రోహి కెసిఆర్… తెలంగాణ ప్రజల వ్యతిరేకి అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ లో ఉన్న లీడర్స్., స్టూడెంట్స్ యూనియన్., షెడ్యూల్ క్యాస్ట్ పెద్దలు., ఐఏఎస్., ips., రెడ్డి సామజిక వర్గాల వారు లేరా? రాజ్య సభకు సీట్లు ఇవ్వడానికి అంటూ ప్రశ్నించారు.
ప్రపంచ లో పేరు గాంచిన వారికి., ప్రజా సేవ చేసిన పెద్దలకు రాజ్య సభలో సీట్ ఇస్తారు అంటూ గుర్తు చేశారు. 2012 లో కాంగ్రెస్ వారు మాకు రాజ్య సభ., ఫారెన్ సీట్ ఇస్తా మన్నారు.. నేను వద్దు అన్నాను. 2005 లో చంద్రబాబు ఇస్తా అన్నారు.. నేను తిరష్కరించాను. కరోనా కష్టాలో ప్రజలను భయాలకు గురి చేసి.. కోట్లు సంపాదించిన వారికీ సీట్ ఇవ్వడమేంటని మండి పడ్డారు. Ed ధర్యాప్తుల్లో 500 కోట్లు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథిరెడ్డి కి రాజ్య సభ సిట్ ఇచ్చారు.
గవర్నమెంట్ ట్యాక్స్ ఎగ్గొట్టిన గ్రానైట్ పరిశ్రమల అధినేత వద్దిరాజు రవిచంద్ర కి రాజ్య సభ సిటా? అంటూ ప్రశ్నించారు. సిగ్గు ఉందా కెసిఆర్… అంటూ తీవ్రంగా విమర్శించారు. బంగారు తెలంగాణ తేవడానికి నేను ముందుకు వచ్చా.. చంద్రబాబులా డబ్బులు పట్టుకొని ap పారిపోనని ఎద్దేవ చేశారు. వీళ్ళకి సీట్ ఇవ్వడం కంటే డాన్ దావుద్ ఇబ్రహీం కి ఇవ్వడం బెటర్ అని పాల్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ పత్రిక నమస్తే తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్రావు కి.. రాజ్య సభ సీటా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీ గవర్నమెంట్ పై నేను ఒక్కడినే పోరాడుతున్నా.. రాహుల్ గాంధీ పడుకొంటున్నారని కొనియాడారు. దేవుడు నన్ను పుట్టించింది ప్రజల కొరకు, గచ్చిబౌలి లో 300 ఎకరాలు లో a1 నిధుతుండి కి సీటు ఇవ్వడంపై అర్థమేంటని తెలిపారు. భూ కబ్జాలు., కుంభ కొనాల వారికీ సీటు ఇవ్వడం ఏంటి..? అంబేద్కర్., పూలె ఆశయాలను నిలబెట్టడానికి..నాతో నడవండి..ముగ్గురు వ్యాపార వేత్తలను రాజ్య సభకు పంపిస్తున్నారు సీఎం కేసీఆర్.
ఉద్యమకారులను పట్టించుకోకుండా బడబాబులకు సీట్లు అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి తమ సొంత ప్రయోజనాలు చూసుకున్నారని విమర్శించారు. Up లో Bsp పార్టీ బలహీన మైన పార్టీ ప్రవీణ్ కుమార్ ఇక్కడ ఎందుకని ప్రశ్నించారు. అవినీతి పరులైన కెసిఆర్., కేటీఆర్ కి ఓటు వేయొచ్చా.? దళిత ముఖ్య మంత్రి.. ఎక్కడ..? రాజ్య సభలో వీరులు..షురూలు., నీతి వంతులకు దళితులకు., sc., కాపులకి ఇవ్వండంటూ మండిపడ్డారు. స్టూడెంట్స్ లీడర్స్., కుర్రాళ్లకి., మహిళలకు ఇవ్వండి… ఆమ్ ఆద్మీ మీ పార్టీ ఇవ్వలేదా…? అంటూ సీఎం కేసీఆర్ పై కేఏ పాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
