NTV Telugu Site icon

K.Laxman : పెంచిన రైతు భరోసా కాదుకదా ఉన్న రైతుబంధును ఎగ్గొట్టింది రేవంత్ ప్రభుత్వం

K Laxman

K Laxman

K.Laxman : రుణమాఫీ చేస్తానని, రైతుబంధు పెంచి ఇస్తానని వాగ్దానాలన్నీ చేసి, ఇవ్వాళ పెంచిన రైతు భరోసా కాదుకదా ఉన్న రైతుబంధును ఎగ్గొట్టిన రేవంత్ ప్రభుత్వమన్నారని పార్లమెంట్ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. రైతులకు రైతు బంధు రాదు, రుణమాఫీ పూర్తి కాదు, బోనస్ బొగస్ అయిపాయె, పంటలు కొనే దిక్కు లేదు. పత్తి రైతులకు మద్దతు ధర లేదని, రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చే సమయంలో రేషన్‌ కార్డు ఆధారంగా ఇచ్చారా? మాఫీకి, దీనికి లింకు పెట్టడం ఏమిటి..? అని ఆయన ప్రశ్నించారు. అధికారం కోసం రైతు భరోసా ఎకరానికి రూ. 15,000 ఇస్తామని మాయ మాటలు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక రైతు భరోసాను పక్కనబెట్టి రోజుకో మాట మాట్లాడుతూ రైతులను మోసం చేస్తోందని, కాంగ్రెస్ వచ్చాక 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న రేవంత్ రెడ్డి.. ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, పరీక్షలు ఎప్పుడూ నిర్వహించారో చెప్పే దమ్ముందా? అని ఆయన అన్నారు. గతేడాది శాసనసభ ఎన్నికలకు ముందు అక్టోబర్ లో అశోక్ నగర్ కు వచ్చి ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి విద్యార్థులకు నమ్మబలికారని, దాదాపు ఏడాది పూర్తైంది. రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు అశోక్ నగర్ కు రావాలి. విద్యార్థులే వాళ్లకు సన్మానం చేస్తారన్నారు లక్ష్మణ్‌.

IND vs NZ: టీమిండియా పరాజయం.. కోహ్లీపై విపరీతమైన ట్రోల్స్

అంతేకాకుండా..’ జల్సాలపై జల్సాలు చేస్తూ తెలంగాణకు దమ్మిడీ ఉపయోగం లేని విదేశీ పర్యటనల్లో తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లో 25 విదేశీ పర్యటనలు కాంగ్రెస్ నాయకులు చేశారు. రైతుబంధు ఇవ్వడానికి, రుణమాఫీ చేయడానికి పైసలు లేవు కానీ మీ విదేశీ పర్యటనలకు డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయ్? అధికారంలోకి రాగానే అభయహస్తం దరఖాస్తుల పేరుతో హడావిడి చేసి కోటి మందికి పైగా ప్రజలను క్యూ లైన్లలో ఇబ్బందులు పెట్టిన రేవంత్ సర్కార్. అప్లై చేసుకున్న పది నెలలు అవుతున్నా ఇప్పటివరకు పథకాల అమలు లేదు. ఇచ్చిన అభయహస్తం దరఖాస్తులు ఏమయ్యాయో కూడా తెలియదు. పథకాలను అమలు చేయకుండా రోజుకో డైవర్షన్ తెరపైకి తెస్తూ హై’డ్రామా’ చేస్తూ కాలయాపన చేస్తున్న చిట్టి నాయుడు. రైతుభరోసా కోసం అన్నదాతలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం విద్యార్థులు, బ్యాక్‌లాగ్‌ పోస్టుల కోసం గురుకుల అభ్యర్థులు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పసి పిల్లల నుంచి పండు ముసలి వరకు రోడ్లపైకి తీసుకురావడమేనా నువ్వు చెప్పిన ప్రజా పాలన? కొత్త ప్రాజెక్టులు నిర్మించకుండా..! ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా..! రైతుల రుణమాఫీ చేయకుండా..! రైతు భరోసా ఇవ్వకుండా..!! పోలీసులు ధర్నాలు చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి ఘటనలు చూడలేదు. రాష్ట్ర సంపద సృష్టికి కాకుండా, కాంగ్రెస్ నాయకుల ఆస్తులు పెంచుకోవడానికి అప్పులు చేయడం క్షమించరాని నేరం.

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదం. పాలన చేతకాని అసమర్థులు రాష్ట్రాన్ని పాలిస్తుంటే ఇట్లనే ఉంటది. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా.. రైతుల రుణమాఫీ చేయకుండా.. రైతు భరోసా ఇవ్వకుండా.. కాలువలల్ల నీళ్ళు వదలకుండా.. తేమ పేరుతో అడ్డగోలుగా కొర్రీలు పెట్టి పత్తి కొనకుండా నిరాకరించగా, అకాల వర్షాలతో రైతులకు మరిన్ని కష్టాలు తెచ్చాయి. 420 హామీల అమలు చేతకాక రోజుకో డ్రామా ఆడుతున్న తుగ్లక్ రేవంత్. కాంగ్రెస్ అసమర్థ పాలనలో చిన్న పిల్లల దగ్గరినుంచి పండు ముసలి వరకు ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ప్రతీ ఏటా జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటిస్తామంటూ నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అసలు రంగు పది నెలల్లోనే బయటపడింది. కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగితలో దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో అధ్వాన్న పరిస్థితులు నెలకొనడమే దీనికి నిదర్శనం. కాంగ్రెస్‌ అంటేనే బోగస్‌ అని మరోసారి రుజువయింది.’ అని కె లక్ష్మణ్‌ అన్నారు.

Chardham Yatra 2024: చార్‌ధామ్ యాత్ర.. 6 నెలల్లో 53 మంది భక్తులు మృతి

Show comments