తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వివిధ పార్టీల్లోకి చేరికలు, రాజీనామాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌లోకి చేరికలు పెరిగాయి. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం రాష్ట్ర కాంగ్రెస్ లో జోష్ పెంచింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడం ఖాయైమంది. అయితే.. నేడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. అరగంటకు పైగా సాగిన భేటీలో వీరిద్దరు కాంగ్రెస్ లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
Also Read : EPFO: అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి తేదీ పొడిగింపు..!
అనంతరం జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేసే దుర్మార్గ పాలన కొనసాగుతోందన్నారు. ప్రజాస్వామ్యం పాతాళానికి, అవినీతి ఆకాశం ఎత్తుకు పోయుందని ఆయన మండిపడ్డారు. బోగస్ మాటలు, అబద్దాలు, వృధా ఖర్చు తప్పితే కేసిఆర్ చేసింది ఏమీ లేదని, ఓ ఫాసిస్ట్ లా, కేసిఆర్ నిరంకుశ ధోరణి తో వ్యవహరిస్తున్నారన్నారు. అంతేకాకుండా.. ‘మరోసారి అధికారానికి ఎట్టిపరిస్థితుల్లోనూ కేసిఆర్ రాకూడదు. సోనియా గాంధీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది. ఈసారైనా ప్రజలు అలా చేయకపోతే దేవుడు కూడా క్షమించదు. నైతికంగా కేసిఆర్ అర్హత కోల్పోయారు. రెండు చేతులు జోడించి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కి రాష్ట్ర ప్రజలు రుణం తీర్చుకోవాల్సి ఉంది.’ అని ఆయన అన్నారు.
Also Read : Aishwarya Sarja: స్టార్ హీరో కూతురుతో కమెడియన్ కొడుకు పెళ్లి.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది
