NTV Telugu Site icon

Jupally Krishna Rao: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు..

Jupalli Krishna Rao

Jupalli Krishna Rao

Jupally Krishna Rao: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ కు లేదని ఎక్సైజ్ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు కొంగ జపం చేస్తున్నారని అన్నారు. ఎంపీ సీట్లు అయినా రాకపోతాయా అని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బావ బామ్మర్దులు తిక్క వాగుడు.. సొల్లు వాగుడు మానుకోవాలని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో తీసుకోవాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం చేశారు. దోపిడి.. కబ్జా దారులు అనే కదా వాళ్ళను ఓడించింది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కు రెండు, మూడు సీట్లు వస్తాయేమో అంతే అంటూ జూపల్లి తెలిపారు.

Read also: KTR: కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు.. మొత్తం 420 హామీలు

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పకడ్బందీ వ్యూహంతో వలసలకు తెరలేపుతోంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ నేతలు సొంత పార్టీని వీడి అధికార కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని వచ్చిన వార్తలు తెలిసిందే.. అయితే ఈ వ్యవహరం పై బీఆర్ఎస్.. కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడుతుంది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్, డీసీసీబీ చైర్మన్ ఆదిబోజారెడ్డి, జైనథ్ జెడ్పీటీ నీ తుమ్మల అరుంధతి, మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, ఇచ్చోడ ఎంపీపీ బీజేపీతోపాటు మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలకు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్‌కు మూకుమ్మడిగా రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్ లోని నేతలు మూకుమ్మడిగా పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నప్పటికీ తాజా మాజీ ఎమ్మెల్యేలు మాత్రం వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం.
MLA Rakshana Nidhi: రెండు రోజుల్లో టీడీపీలో చేరడంపై క్లారిటీ..! వైసీపీ ఎమ్మెల్యే ప్రకటన

Show comments