Site icon NTV Telugu

MLC Kavitha: లిక్కర్ కేసులో కవిత బెయిల్ పై ఇవాళ తీర్పు..

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్‌పై నేడు తీర్పు రానుంది. లిక్కర్ ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈ రెండు కేసుల్లో ఈడీ, సీబీఐ వాదనలు ముగిశాయి. ఈరోజు కవిత బెయిల్‌పై రోస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పు వెలువడనుంది. మద్యం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 11న సీబీఐ కవితను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ కింద తీహార్ జైలులో ఉన్నాడు. కవిత జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. అయితే.. ఒకవేళ కవితకు బెయిల్‌ లభిస్తే జ్యుడీషయల్‌ రిమాండ్‌ నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇక బెయిల్‌ను న్యాయస్థానం నిరాకరిస్తే మాత్రం.. కవితను కోర్టులో హాజరుపరుస్తారు.

Read also: Hi Nanna : మరో అరుదైన ఘనత సాధించిన నాని సినిమా..

గత విచారణలో చెప్పిన రోస్ అవెన్యూ కోర్టు తీర్పును మరోసారి వాయిదా వేయడంతో కవితకు నిరాశే ఎదురైంది. ఈడీ, సీబీఐ కేసుల్లో మే 6న తీర్పులు వెలువడనున్నాయని వెల్లడించారు. ఈడీ అరెస్ట్ చట్ట విరుద్ధమంటూ కోర్టులో పోరాడిన కవిత పిటిషన్లను కోర్టులు కొట్టివేశాయి. దీంతో కవిత బెయిల్ కోసం ప్రయత్నించారు. తొలుత మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నించిన కవిత.. రోస్ అవెన్యూ కోర్టులో హాజరుకాగా, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం పోరాడుతూనే ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తుండగా, సీబీఐ అవినీతి రంగంలోకి దిగింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు మళ్లీ పిడుగు పడినట్లుగా సీబీఐ కూడా రంగంలోకి దిగి కవితను అరెస్ట్ చేసి విచారించింది. సీబీఐ కేసులో కూడా బెయిల్ పొందేందుకు కవిత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కక్ష సాధింపు చర్యలో భాగమే తనపై తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేశారని కవిత పదే పదే చెబుతున్నారు. మీడియాతో మాట్లాడవద్దని కవితను కోర్టు ఆదేశించన విషయం తెలిసిందే..
Astrology: మే 06, సోమవారం దినఫలాలు

Exit mobile version