NTV Telugu Site icon

Hyderabad: మైనర్‌ బాలిక ఆచూకీ లభ్యం.. 5 రోజులు, 200 సీసీ కెమెరాలు వడపోసిన హెడ్‌ కానిస్టేబుల్‌

Girl Missing Case

Girl Missing Case

ఐదు రోజుల తర్వాత జూబ్లీహిల్స్‌ బాలిక మిస్సింగ్‌ కేసును పోలీసులు ఛేదించారు. హెడ్‌కానిస్టేబుల్‌ నాగేశ్వరరావు కష్టం వల్లే బాలిక జాడ లభ్యమైంది. ఇటీవల తన 15 సంవత్సరాల కూతురు కనిపించడం లేదంటూ బాలిక తండ్రి ఐదు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌ పోలీసుల స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తండ్రితో కలిసి నివసిస్తున్న మైనర్ బాలిక యూసఫ్‌ గూడలోని స్థానిక పాఠశాలలలో 10వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో 5 నెలల క్రితం బాలిక తల్లి చనిపోవడంతో ఒంటరైన ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లింది. స్కూల్‌కు సరిగ వెళ్లకపోవడంతో ఆమెను సోదరుడు మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక నవంబర్‌ 10న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్‌ కేసు కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Also Read: UFO: ఇంఫాల్‌ ఎయిర్‌పోర్టుపై గుర్తుతెలియని వస్తువు కలకలం.. రంగంలోకి రఫేల్‌

కేసు నమోదు అనంతరం హెడ్‌ కానిస్టేబుల్‌ నాగేశ్వరరావు బాలికను వెతికే పనిలో నిమగ్నమయ్యాడు. వెంకటగిరిలోని బాలిక నివాసం నుంచి కేసు దర్యాప్తు చేపట్టాడు. బాలిక నివాసం వద్ద స్థానిక సీసీ కెమెరాలను పరిశీలించగా అక్కడ ఆమె ఆటో ఎక్కినట్టు గుర్తించారు. స్థానికంగా ఉన్న 30 సీసీ కెమెరాలు వడపోయగా పోలీసులు ఆటో నెంబర్‌ను గుర్తించి డ్రైవర్‌ను విచారించడంతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద బాలికను దింపినట్టు డ్రైవర్‌ పోలీసులకు తెలిపాడు. దీంతో రైల్వే స్టేషన్‌ పరిధిలోని దాదాపు 75 సీసీ కెమెరాలు వడపోయగా ఆమె ఓ వ్యక్తితో మాట్లాడుతూ బయటకు వచ్చినట్టు గుర్తించారు. అతడితో స్కూటర్‌ ఎక్కి వెళ్లినట్టుగా సీసీ కెమోరాలో రికార్డు అయ్యింది. దీంతో అల్ఫా హోటల్‌ సమీపంలో 50 సీసీ కెమెరాలు పరిశీలించి మహాంకాళి పెట్రోల్‌ బంక్‌లో పెట్రోల్‌ కోసం స్కూటర్‌ ఆపినప్పుడు బండి నెంబర్‌ను కనుగొన్నారు.

Also Read: Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు

బైక్‌ నంబర్‌ సహాయంతో పోలీసులు ఆ వ్యక్తి అడ్రస్‌ తెలుసుకుని విచారించారు. అతడిని పట్టుకుని ప్రశ్నించడంతో బాలిక ఆచూకి లభ్యమైంది. రైల్వే స్టేషన్‌ సదరు బాలిక ఏడుస్తూ కనిపించందని, ఏమైందని అడగడంతో తాను చనిపోతానంటూ చెప్పిందన్నాడు. దీంతో ఆమెకు ధైర్యం చెప్పి జూబ్లీ బస్‌స్టేషన్‌ వెయిటింగ్‌ రూంలో ఉంచామని తెలిపాడు. బాలిక మానసిక పరిస్థితి బాగోలేదని గుర్తించి ఆ మరుసటి రోజు ఆమెను మహాంకాళిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చానని అతడు పోలీసులు తెలిపాడు. దీంతో ఊపీరి పీల్చుకున్న పోలీసులు బాలిక కోసం ఆస్పత్రికి వెళ్లి ఆమెను తన కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలిక కోసం నిద్రహరాలు మాని 5 రోజుల పాటు దాదాపు 200 సీసీ కెమెరాలు వడపోసి బాలిక ఆచూకి కనుగొన్న హెడ్‌కానిస్టేబుల్‌ నాగేశ్వరరావును అందరు ప్రశంసిస్తున్నారు.